Telugu Global
MOVIE UPDATES

తల్లి కాబోతున్న అలియా భట్

ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు రణబీర్, అలియా భట్. వీళ్ల పెళ్లయి ముచ్చటగా 3 నెలలు కూడా పూర్తవ్వలేదు. అంతలోనే గర్భందాల్చింది అలియా భట్. అవును.. అలియాభట్ తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. త్వరలోమ తమ జీవితంలోకి ఓ బేబీ రాబోతోందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా ఓ ఫొటో కూడా షేర్ చేసింది అలియా భట్. హాస్పిటల్ బెడ్ పై అలియాభట్ పడుకొని ఉంది. పక్కనే భర్త రణబీర్ […]

తల్లి కాబోతున్న అలియా భట్
X

ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు రణబీర్, అలియా భట్. వీళ్ల పెళ్లయి ముచ్చటగా 3 నెలలు కూడా పూర్తవ్వలేదు. అంతలోనే గర్భందాల్చింది అలియా భట్. అవును.. అలియాభట్ తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. త్వరలోమ తమ జీవితంలోకి ఓ బేబీ రాబోతోందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

ఈ సందర్భంగా ఓ ఫొటో కూడా షేర్ చేసింది అలియా భట్. హాస్పిటల్ బెడ్ పై అలియాభట్ పడుకొని ఉంది. పక్కనే భర్త రణబీర్ కపూర్ కూర్చున్నాడు. వైద్యులు వీళ్లకు స్క్రీన్ పై అలియాభట్ గర్భాన్ని చూపిస్తున్నారు. అది చూసి వీళ్లిద్దరూ సంతోష పడుతున్నారు. ఈ ఫొటోను అలియాభట్ షేర్ చేసింది.

దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు రణబీర్, అలియా. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీళ్ల పెళ్లి సింపుల్ గా, రణబీర్ ఇంట్లోనే జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్ కు కూడా వెళ్లలేదు. అంతలోనే అలియాభట్ గర్భం దాల్చింది.

రీసెంట్ గా గంగూభాయ్ కతియావాడీ, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో నటించింది అలియాభట్. బ్రహ్మాస్త్ర సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆమె చేతిలో మరో 2 సినిమాలు షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ రెండు సినిమాల్ని ఆమె పూర్తి చేస్తుందా లేక కెరీర్ లో గ్యాప్ తీసుకుంటుందా అనేది చూడాలి.

First Published:  27 Jun 2022 9:59 AM IST
Next Story