Telugu Global
NEWS

సూపర్ యాప్ MYn వచ్చేస్తోంది.. ఫీచర్లు ఏంటంటే..

ఇప్పుడు ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్లలో తప్పకుండా ఉండే యాప్స్ ఏంటంటే.. సోషల్ మీడియా, ఈ-కామర్స్, క్యాబ్ రైడింగ్, ఓటీటీ. అత్యధిక మంది వినియోగదారులు తమ ఫోన్లలో ఈ యాప్స్‌నే నిక్షిప్తం చేసుకున్నారని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దీంతో ఒక్కో అవసరానికి ఒకటికి మించిన యాప్స్ మన ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకోవల్సి వస్తుంది. దీని వల్ల ప్రతీ సారి ఆ అవసరానికి ఆయా యాప్స్ ఓపెన్ చేయాల్సిందే. మరోవైపు ఇన్ని యాప్స్ ఫోన్లో ఉండటం వల్ల దాని […]

సూపర్ యాప్ MYn వచ్చేస్తోంది.. ఫీచర్లు ఏంటంటే..
X

ఇప్పుడు ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్లలో తప్పకుండా ఉండే యాప్స్ ఏంటంటే.. సోషల్ మీడియా, ఈ-కామర్స్, క్యాబ్ రైడింగ్, ఓటీటీ. అత్యధిక మంది వినియోగదారులు తమ ఫోన్లలో ఈ యాప్స్‌నే నిక్షిప్తం చేసుకున్నారని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

దీంతో ఒక్కో అవసరానికి ఒకటికి మించిన యాప్స్ మన ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకోవల్సి వస్తుంది. దీని వల్ల ప్రతీ సారి ఆ అవసరానికి ఆయా యాప్స్ ఓపెన్ చేయాల్సిందే. మరోవైపు ఇన్ని యాప్స్ ఫోన్లో ఉండటం వల్ల దాని పని తీరు కూడా మందగిస్తుంది. దీనికి పరిష్కారంగా బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ MYn (మైన్) అనే సూపర్ యాప్‌ను రూపొందించింది.

నెక్స్‌జెన్ డేటా సెంటర్ అండ్ క్లౌడ్ టెక్నాలజీస్ అనే సంస్థను గతంలో ప్రారంభించిన వారిలో ఒకరైన రాజగోపాల్.. తాజాగా ఈ యాప్‌ను రూపొందించారు. వేర్వేరు యాప్స్ ఉపయోగించకుండానే ఒకే దానిలో ఓటీటీ, మెసింజ‌ర్‌, ఈ-కామర్స్, సోషల్ మీడియా, క్యాబ్ బుకింగ్ వంటివి చేసే వీలుంటుంది. ఇందులోని నాలుగు సెక్షన్లు నాలుగు ఫీచర్లను కలిగి ఉంటాయని ఆయన చెప్తున్నారు.

MYWorld పేరుతో ఉండే సెక్షన్ సోషల్ మీడియా తరహాలో పని చేస్తుంది. ఇందులోని ఫీడ్ ప్రత్యేకంగా యూజర్ బేస్డ్‌గా ఉంటుంది. ఇది ఎలాంటి కంటెంట్‌ను లేదా కంటెంట్ క్రియేటర్‌ను ప్రమోట్ చేయదు. అంటే అందరు యూజర్లను సమానంగానే చూస్తుందని రాజగోపాల్ చెప్తున్నారు. ఇక MyTV అనే సెక్షన్‌లో యూజర్లు క్రియేట్ చేసిన కంటెంట్‌తో నిండి ఉంటుంది.

ఇందులో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, సినిమాలు అన్నీ ఉంటాయి. అంటే ఒక ఓటీటీలా పని చేస్తుందన్నమాట. ఇది పూర్తిగా యూజర్ క్రియేట్ చేసిన కంటెంట్‌తోనే నిండి ఉంటుందని ఆయన చెప్తున్నారు.

MYLocal సెక్షన్‌లో యూజర్‌కు సమీపంలోని దుకాణాలు, రెస్టారెంట్లు, క్యాబ్స్, ఆటోలు కనపడుతుంటాయి. దీని ద్వారా ఏవైనా ఆర్డర్ చేసుకోవడం, క్యాబ్స్ బుక్ చేసుకోవడం వంటివి చేసుకోవచ్చు. ఇదొక ఈ-కామర్స్ యాప్ లాగా పనిచేస్తుంది. ఇక MyOwn అనే సెక్షన్ పూర్తిగా వాట్సప్ తరహాలో ఉంటుంది. ఫ్రెండ్స్, కొలీగ్స్‌తో చాట్ చేసుకోవడం, గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడానికి ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది. అంతే కాకుండా యూజర్లు భారీ ఫైల్స్‌ను కూడా దీని ద్వారా పంపించుకోవచ్చు.

కాగా, MYn ప్రైవసీకి పెద్ద పీట వేసినట్లు చెబుతున్నది. యూజర్ డేటాను థర్డ్ పార్టీకి ఇవ్వమని.. అంతెందుకు.. యూజర్ పేరు కూడా యాప్‌లో కనపడదని చెప్తోంది. పేరు, ఫోన్ నెంబర్ అనేవి అసలు కనపడవని, ఏడు అక్షరాల యునీక్ ఐడీ మాత్రం యూజర్లు ఉపయోగించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇది యూజర్ల గోప్యతకు ఉపయోగపడుతుందని చెప్తోంది.

ఈ యాప్‌లో ఎలాంటి యాడ్స్ రావని.. మన యాక్టివిటీస్‌ను కూడా ట్రాక్ చేయదని MYn రూపకర్తలు చెప్తున్నారు. ఇందులో కనీసం గూగుల్ మ్యాప్స్ కూడా ఉపయోగించడం లేదని.. సొంతంగా తయారు చేసిన మ్యాప్స్ ఉపయోగిస్తున్నామని అంటున్నారు. ప్రస్తుతం బెంగళూరులో అందరికీ అందుబాటులో ఉన్నదని.. త్వరలోనే మరిన్ని నగరాల్లోకి విస్తరిస్తామని మైన్ చెప్తోంది.

First Published:  27 Jun 2022 3:00 PM IST
Next Story