Telugu Global
NEWS

భారీ మెజారిటీ దిశగా వైసీపీ, వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో భారీ మెజారిటీ దిశగా వైసీపీ వెళ్తోంది. ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి వైసీపీ అభ్యర్థి మైకపాటి విక్రమ్‌ రెడ్డి 32వేల 892 ఓట్ల మెజారిటీ సాధించారు. బీజేపీ అభ్యర్థి భరత్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. తొలి రౌండ్ నుంచే వైసీపీ హవా నడుస్తోంది. ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి.. వైసీపీ అభ్యర్థికి మొత్తం 40వేల 377 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 7485 ఓట్లు వచ్చాయి. ఆఖరి రౌండ్లలో […]

భారీ మెజారిటీ దిశగా వైసీపీ, వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి
X

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో భారీ మెజారిటీ దిశగా వైసీపీ వెళ్తోంది. ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి వైసీపీ అభ్యర్థి మైకపాటి విక్రమ్‌ రెడ్డి 32వేల 892 ఓట్ల మెజారిటీ సాధించారు. బీజేపీ అభ్యర్థి భరత్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. తొలి రౌండ్ నుంచే వైసీపీ హవా నడుస్తోంది.

ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి.. వైసీపీ అభ్యర్థికి మొత్తం 40వేల 377 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 7485 ఓట్లు వచ్చాయి. ఆఖరి రౌండ్లలో మెజారిటీ వేగం తగ్గుతుందని బీజేపీ ఆశలు పెట్టుకున్నా ఆ అవకాశం కూడా కనిపించడం లేదు.

చేజర్ల మండలంలో గత ఎన్నికల్లో టీడీపీకి స్వల్ప మెజారిటీ వచ్చింది. దాంతో ఈసారి ఆ ఓట్లు తమ పార్టీకి వస్తాయని బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఆ మండలం ఓట్లు ఆఖరిలో లెక్కిస్తారు. ఇప్పటికే అతి భారీ మెజారిటీ దిశగా వైసీపీ వెళ్తున్న నేపథ్యంలో ఏ మండలంలో కూడా ప్రత్యర్థి పార్టీకి పట్టు దొరికే సూచనలు కనిపించడం లేదు.

వైసీపీ నేతలు లక్ష మెజారిటీ అంచనా వేశారు.. అయితే ఈసారి పోలింగ్ శాతం తగ్గిన నేపథ్యంలో ఆ మెజారిటీని అందుకోవడం కాస్త కష్టంగా కనిపిస్తోంది. 2019లో 82 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి కవేలం 64 శాతం మాత్రమే నమోదైంది. దాదాపు 18 శాతం ఓటింగ్ పడిపోయింది. భారీగా పోలింగ్ నమోదు అయి ఉంటే మరింత మెజారిటీ పెరిగి ఉండేదన్న అభిప్రాయం వైసీపీలో ఉంది.

First Published:  26 Jun 2022 5:19 AM IST
Next Story