Telugu Global
NEWS

ఆత్మకూరులో వైసీపీ భారీ విజయం, డిపాజిట్ కోల్పోయిన‌ బీజేపీ

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అతి భారీ విజయాన్నే సాధించింది. ఓటింగ్‌ శాతం తగ్గడంతో మెజారిటీపై ప్రభావం పడుతుందని భావించారు. అయినప్పటికీ అతి భారీ విజయాన్నే మేకపాటి విక్రమ్ రెడ్డి సొంతం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి ఇక్కడా డిపాజిట్లు వదిలేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి 20వేల ఓట్లను కూడా సాధించలేకపోయారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. వైసీపీకి ఉద్యోగులు ఈసారి వ్యతిరేకంగా పనిచేశారని కౌంటింగ్ ప్రారంభం సమయంలో కొందరు వైసీపీ నేతలు మీడియా వద్ద వ్యాఖ్యలు చేశారు. […]

ఆత్మకూరులో వైసీపీ భారీ విజయం, డిపాజిట్ కోల్పోయిన‌ బీజేపీ
X

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అతి భారీ విజయాన్నే సాధించింది. ఓటింగ్‌ శాతం తగ్గడంతో మెజారిటీపై ప్రభావం పడుతుందని భావించారు. అయినప్పటికీ అతి భారీ విజయాన్నే మేకపాటి విక్రమ్ రెడ్డి సొంతం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి ఇక్కడా డిపాజిట్లు వదిలేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి 20వేల ఓట్లను కూడా సాధించలేకపోయారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు.

వైసీపీకి ఉద్యోగులు ఈసారి వ్యతిరేకంగా పనిచేశారని కౌంటింగ్ ప్రారంభం సమయంలో కొందరు వైసీపీ నేతలు మీడియా వద్ద వ్యాఖ్యలు చేశారు. కానీ పోస్టల్‌ బ్యాలెట్లలోనూ వైసీపీకి భారీ మెజారిటీ దక్కింది. మొత్తం 217 పోస్టల్ బ్యాలెట్‌ పోలవగా… అందులో 205 చెల్లుబాటు అయ్యాయి. అందులో ఏకంగా 167 పోస్టల్ బ్యాలెట్లు వైసీపీకి పడ్డాయి.

దాదాపు అన్ని వర్గాల ప్రజలు వైసీపీకి మద్దతు పలికారన్నది భారీ మెజారిటీ బట్టి అర్థమవుతోంది. స్థానిక తిరునాళ్ల కారణంగా ఓటింగ్ శాతం తగ్గిందన్న అంచనా ఉంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఏకంగా 18 శాతానికిపైగా పోలింగ్ శాతం తగ్గింది. పోలింగ్ శాతం కొద్ది మేర పెరిగి ఉంటే వైసీపీ ఈజీగానే లక్ష మెజారిటీని సొంతం చేసుకునేదన్న అభిప్రాయం ఉంది. మేకపాటి విక్రమ్ రెడ్డి 82వేల 888ఓట్ల మెజారిటీలో ఘనవిజయం సాధించారు.

విక్రమ్ రెడ్డి మొత్తం లక్షా 22వేల 240 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌కు కేవలం 19వేల 352 మాత్రమే సాధించారు. ఏపీలో తన బలాన్ని ప్రదర్శించాలనుకుంటున్న ప్రతిసారీ బీజేపీ అవమానకరంగా చతికిలపడుతూనే ఉంది. తిరుపతి, బద్వేల్‌ ఉప ఎన్నికల్లోనూ ఇలాగే చేతులు కాల్చుకుంది. ఇప్పుడు ఆత్మకూరులోనూ డిపాజిట్లు సాధించలేక బోల్తాకొట్టింది. 2019 ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి టీడీపీ అభ్యర్థిపై 22వేల 276 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇప్పుడా మెజారిటీ అనేక రెట్లు పెరిగింది.

First Published:  26 Jun 2022 6:01 AM IST
Next Story