మహారాష్ట్ర సంక్షోభం.. రంగంలోకి దిగిన సీఎం ఉద్ధవ్ భార్య రష్మి
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే భార్య రష్మి థాక్రే కూడా రంగంలోకి దిగారు.. ఆమె నేరుగా రెబెల్ ఎమ్మెల్యేల భార్యలను కాంటాక్ట్ చేయడం ప్రారంభించారు. ముంబైకి తిరిగిరావాలని మీ భర్తలకు చెప్పండమ్మా అంటూ ‘హోం డిపార్ట్మెంట్’ తో సంప్రదింపులు ప్రారంభించారు. ఈ పొలిటికల్ క్రైసిస్ ని పరిష్కరించడంలో మీరు కూడా ముందుండాలని ఆమె వారిని కోరుతున్నారు. మీ భర్తలను బుజ్జగించండి.. ఇక జాప్యం చేయకండి అని ఆమె వారికి సూచిస్తున్నారు. ఇందులో తన […]
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే భార్య రష్మి థాక్రే కూడా రంగంలోకి దిగారు.. ఆమె నేరుగా రెబెల్ ఎమ్మెల్యేల భార్యలను కాంటాక్ట్ చేయడం ప్రారంభించారు.
ముంబైకి తిరిగిరావాలని మీ భర్తలకు చెప్పండమ్మా అంటూ ‘హోం డిపార్ట్మెంట్’ తో సంప్రదింపులు ప్రారంభించారు. ఈ పొలిటికల్ క్రైసిస్ ని పరిష్కరించడంలో మీరు కూడా ముందుండాలని ఆమె వారిని కోరుతున్నారు. మీ భర్తలను బుజ్జగించండి.. ఇక జాప్యం చేయకండి అని ఆమె వారికి సూచిస్తున్నారు.
ఇందులో తన భర్త ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోకుండా చూడడానికా అన్నట్టు రష్మి ఇలా రెబల్ ఎమ్మెల్యేల భార్యలను మచ్చిక చేసుకోవడం మొదలెట్టారు రష్మి థాక్రే. మరి ఆ భార్యలనుంచి స్పందన ఇంకా తెలియదు గానీ.. ఇదే సమయంలో థాక్రే కూడా గౌహతిలోని కొంతమంది తిరుగుబాటు సేన సభ్యులకు మెసేజ్ లు ఇస్తున్నారు. తెగేదాకా సమస్య సాగదీయవద్దని సూచిస్తున్నారు.
శివసేన కార్యకర్తల నిరసన
రాష్ట్ర రాజకీయ సంక్షోభానికి కారణమయ్యాడంటూ సేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండేకి, ఆయన వర్గానికి వ్యతిరేకంగా సేన కార్యకర్తలు ఆందోళన ప్రారంభించారు. నిషేధాజ్ఞలు అమలులో ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో వారు ముంబైలో సామ్నా ఆఫీసు బయట ఆదివారం ఉదయం బైక్ ర్యాలీ నిర్వహించారు. రెబల్ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పూణేలో ‘జూతే మారో ఆందోళన్ ‘ అంటూ షిండే, ఇతర రెబల్ నేతల పోస్టర్లను కార్యకర్తలు చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. అయితే థానేలో షిండే మద్దతుదారులు .. ఉద్ధవ్ థాక్రే పోస్టర్లపై పెయింట్ పూసి ప్రొటెస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా ఈ నెల 27 న నామినేషన్ వేస్తున్న సందర్భంగా ..పవార్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక తమకు డిప్యూటీ స్పీకర్ వారం రోజుల వ్యవధినివ్వాల్సి ఉండిందని, కేవలం రెండు రోజులే ఇచ్చారని షిండే వర్గం ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఈ రెండు రోజుల సమయంచాలదని అంటున్నారు. వీరు రేపు సాయంత్రం 5 గంటల కల్లా తమ సమాధానాలను డిప్యూటీ స్పీకర్ కి తెలియజేయాల్సి ఉంది. ఇక గవర్నర్ కోష్యారీ ఈ ఉదయం ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ పాజిటివ్ కి గురైన ఆయన చికిత్స పొందిన విషయం తెలిసిందే.