రెబెల్స్ తో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఢీ అంటే ఢీ..ఈసీ కి లేఖ!
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. మహావికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వం పతనం అవడం ఖాయం అనే పరిస్థితుల నుంచి తిరుగుబాటు గ్రూపుతో ఢీ అంటే ఢీ అంటూ గట్టి పోరాటానికి సిద్ధమవుతోంది. తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే తన బృందానికి ‘శివసేన బాలాసాహెబ్’ అని పేరు పెట్టనున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే శనివారంనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధక్షతన జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశం ‘శివసేన’, ‘బాలాసాహెబ్ ఠాక్రే’ […]
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. మహావికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వం పతనం అవడం ఖాయం అనే పరిస్థితుల నుంచి తిరుగుబాటు గ్రూపుతో ఢీ అంటే ఢీ అంటూ గట్టి పోరాటానికి సిద్ధమవుతోంది.
తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే తన బృందానికి ‘శివసేన బాలాసాహెబ్’ అని పేరు పెట్టనున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే శనివారంనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధక్షతన జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశం ‘శివసేన’, ‘బాలాసాహెబ్ ఠాక్రే’ పేర్లను ఏ వర్గమూ ఉపయోగించకూడదని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ విషయమై పార్టీ ఎన్నికల సంఘానికి ఒకలేఖ రాసింది.
” కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ శివసేన, బాలాసాహెబ్ పేర్లను దుర్వినియోగ పరుస్తున్నట్టు తెలిసింది. వారి కార్యకలాపాలకు మేము అడ్డురాదల్చుకోలేదు. అయితే శివసేన, బాలాసాహెబ్ పేర్లను వారు ఉపయోగించుకోవడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముందుగా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాం” అని ఆ లేఖలో పేర్కొన్నారు.
అంతకు ముందు సమావేశంలో ఉద్దవ్ మాట్లాడుతూ .. “కొందరు నన్ను ఏదో చెప్పమని అడుగుతున్నారు, కానీ వారు (రెబల్ ఎమ్మెల్యేలు) ఏమి చేయాలనుకుంటే అది చేసుకోవచ్చని నేను ఇప్పటికే చెప్పాను, వారి విషయాలలో నేను జోక్యం చేసుకోను, వారు తమ స్వంత నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ఎవరూ బాలాసాహెబ్ ఠాక్రే, శివసేన పేర్లను మాత్రం ఉపయోగించకూడదు.” అని ఉద్ధవ్ అన్నారు. కాగా,ఇప్పటికే 16 మంది తిరుగుబాటు నేతలకు అనర్హత నోటీసులు జారీచేశారు. సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసుల్లో డిప్యూటీ స్పీకర్ నరహరి ఆదేశించారు.