ఆదివారం సరదాగా.. ఈ నిజాలు మీకు తెలుసా
ప్రతీరోజు మనం గమనించేవి, చూసేవి అయినా కొన్ని విషయాలు మనకు తెలియక పోవచ్చు. మరికొన్ని విషయాలు తెలుసుకొని ఆశ్చర్యం వేయవచ్చు. అలాంటివి ఇప్పుడు కొన్ని చూద్దాం. – i అక్షరంపై ఉండే డాట్‌ను టైటిల్ అంటారు. – శనివారం రోజు పిల్లలు తక్కువగా పుడతారట. – మన కడుపులో ఉండే ఆమ్లాలు రేజర్ బ్లేడును కూడా జీర్ణం చేయగలవు. – అన్నింటిలో నుంచి దూసుకొని వెళ్లే లేజర్ బీమ్.. నీటిలో మాత్రం ఆగిపోతుంది. – ప్రపంచంలో ఉత్పత్తి […]
ప్రతీరోజు మనం గమనించేవి, చూసేవి అయినా కొన్ని విషయాలు మనకు తెలియక పోవచ్చు. మరికొన్ని విషయాలు తెలుసుకొని ఆశ్చర్యం వేయవచ్చు. అలాంటివి ఇప్పుడు కొన్ని చూద్దాం.
– i అక్షరంపై ఉండే డాట్‌ను టైటిల్ అంటారు.
– శనివారం రోజు పిల్లలు తక్కువగా పుడతారట.
– మన కడుపులో ఉండే ఆమ్లాలు రేజర్ బ్లేడును కూడా జీర్ణం చేయగలవు.
– అన్నింటిలో నుంచి దూసుకొని వెళ్లే లేజర్ బీమ్.. నీటిలో మాత్రం ఆగిపోతుంది.
– ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌లో సగం సముద్ర జీవుల నుంచే వస్తుంది.
– పరుగెత్తని వాళ్ల కంటే పరుగెత్తే వాళ్ల జీవిత కాలం ఎక్కువ.
– పరుగు అనేక క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడుతుంది.
– గుడ్లు పెట్టే జీవులకు ఊబకాయం రాదు.
– ఒంటెకు మూడు కనురెప్పలు ఉంటాయి. ఎడారి తుఫానుల నుంచి కళ్లను కాపాడుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి.
– కోకాకోలా వాస్తవానికి పచ్చ రంగులో ఉంటుంది.
– అన్ని పోలార్ బేర్స్ ఎడమ చేతి వాటం కలిగి ఉంటాయి.
– మగవాళ్ల కంటే ఆడవాళ్లు రెండు రెట్లు ఎక్కువగా కనురెప్పలు కొడతారు.
– అన్ని లిప్‌స్టిక్స్‌లో చేపల పొలుసుల నుంచి వచ్చే పదార్థాన్ని వాడతారు.
– 27 ఏళ్ల వయసు నుంచి మన మెదడులో కణజాలం నశించడం ప్రారంభమవుతుంది.
– పందులకు కూడా డిప్రెషన్ కలుగుతుందట.
– మన ముక్కు 1 ట్రిలియన్ వాసనలు పసికడుతుంది.
– ఒక సాధారణ మబ్బు 1.1 మిలియన్ పౌండ్ల బరువు ఉంటుంది.
– మనిషిలోని అతి చిన్న ఎముక చెవిలో ఉంటుంది.
– అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్. డబ్ల్యూ. బుష్.. ఒకప్పుడు చీర్ లీడర్‌గా పని చేసేవాడు.
– పాములు భూకంపాలను ముందుగానే పసిగడతాయి.
– మొసలి తన నాలుకను బయటకు చాపలేదు.
– మెక్సికోలో జైలు నుంచి తప్పించుకోవడం చట్టబద్దం.
– అప్పుడే పుట్టిన పిల్లలు కన్నీళ్లు కార్చలేరు.
– అన్ని ఆహార పదార్థాల కంటే పొటాటో చిప్స్ వల్లే ఊబకాయం అధికంగా వస్తుంది.
– ఇంట్లో పేరుకునే దుమ్ములో అధికంగా ఉండేది మన శరీరం నుంచి రాలే మృత చర్మ కణాలే.
– ప్రపంచంలో అత్యధిక పిరమిడ్లు ఉన్న దేశం ఈజిప్టు కాదు. అక్కడ 138 పిరిమిడ్లు ఉండగా.. సూడాన్‌లో 255 పిరమిడ్లు ఉన్నాయి.
– మానవ శరీరంలో ఉండే నాడీ వ్యవస్థ 60 వేల మైళ్ల పొడవు ఉంటుంది.
– ప్రపంచంలోని స్వచ్ఛమైన నీటిలో 69 శాతం మంచు రూపంలోనే ఉన్నది.