Telugu Global
National

యోగి హెలికాప్టర్ ను ఢీకొన్న పక్షి.. తప్పిన ప్రమాదం..!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పక్షి ఢీకొనడంతో టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే మళ్లీ హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. యోగి వారణాసి నుంచి లక్నోకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. యోగి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పక్షి ఢీ కొందని వార్తలు రావడంతో ఆయనకు ఏమైందోనని ప్రజలు, పార్టీ శ్రేణులు ఆందోళన పడ్డారు. అయితే ఆయన సేఫ్ గా ఉన్నారని తెలియడంతో […]

యోగి హెలికాప్టర్ ను ఢీకొన్న పక్షి.. తప్పిన ప్రమాదం..!
X

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పక్షి ఢీకొనడంతో టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే మళ్లీ హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. యోగి వారణాసి నుంచి లక్నోకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. యోగి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పక్షి ఢీ కొందని వార్తలు రావడంతో ఆయనకు ఏమైందోనని ప్రజలు, పార్టీ శ్రేణులు ఆందోళన పడ్డారు. అయితే ఆయన సేఫ్ గా ఉన్నారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో పర్యటించారు. నిన్న ఆయన కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇవాళ ఉదయం వారణాసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించిన ముఖ్యమంత్రి యోగి ఉదయం 9 గంటల సమయంలో వారణాసి నుంచి తిరిగి లక్నోకు హెలికాప్టర్ లో బయలుదేరారు.

అయితే ఆ హెలికాప్టర్ ను టేకాఫ్ అయిన 4 నిమిషాల్లోనే అధికారులు తిరిగి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీనిపై జిల్లా మెజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పక్షి ఢీకొనడంతో ఆయన భద్రతను దృష్టిలో పెట్టుకుని అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు చెప్పారు. అనంతరం ఆయన సర్కూట్ హౌస్ లో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత బబత్ పూర్ విమానాశ్రయం నుంచి విమాన మార్గంలో లక్నో వెళ్లినట్లు తెలిపారు. కాగా యోగి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పక్షి ఢీ కొనడంతో కొంత సేపు హైరానా పడ్డ అధికారులు ఆయన సేఫ్ గా ల్యాండ్ కావడంతో ఊపిరిపీల్చుకున్నారు.

First Published:  26 Jun 2022 8:01 AM IST
Next Story