అప్పులిచ్చి డబ్బు పోగొట్టుకున్న హీరో
ఇండస్ట్రీలో చాలామంది హీరోలున్నారు. కానీ మంచి హీరో ఎవరంటే మాత్రం చాలామంది చెప్పే పేరు గోపీచంద్. కల్మషం లేని హీరో ఇతడు. రెమ్యూనరేషన్ అస్సలు డిమాండ్ చేయడు. ఓ రేటుకు కమిట్ అయిన తర్వాత అంత ఇవ్వకపోయినా అడగడు. పైపెచ్చు తను తిరిగి అప్పులు ఇస్తుంటాడు. అలా తన జీవితంలో చాలా మందికి అప్పులు ఇచ్చానని చెప్పుకొచ్చాడు గోపీచంద్. అయితే తను ఇచ్చిన అప్పుల్లో 90శాతం తిరిగి రాలేదన్నాడు. వాళ్లంతా తన కళ్లముందే కనిపిస్తారని, కానీ వాళ్ల […]
ఇండస్ట్రీలో చాలామంది హీరోలున్నారు. కానీ మంచి హీరో ఎవరంటే మాత్రం చాలామంది చెప్పే పేరు గోపీచంద్. కల్మషం లేని హీరో ఇతడు. రెమ్యూనరేషన్ అస్సలు డిమాండ్ చేయడు. ఓ రేటుకు కమిట్ అయిన తర్వాత అంత ఇవ్వకపోయినా అడగడు. పైపెచ్చు తను తిరిగి అప్పులు ఇస్తుంటాడు.
అలా తన జీవితంలో చాలా మందికి అప్పులు ఇచ్చానని చెప్పుకొచ్చాడు గోపీచంద్. అయితే తను ఇచ్చిన అప్పుల్లో 90శాతం తిరిగి రాలేదన్నాడు.
వాళ్లంతా తన కళ్లముందే కనిపిస్తారని, కానీ వాళ్ల ఆర్థిక పరిస్థితి చూసి తనకే డబ్బులు అడగాలని అనిపించదంటున్నాడు.
అలా 10 లక్షల నుంచి మొదలుపెట్టి, 50లక్షల రూపాయల వరకు అప్పులిచ్చిన సందర్భాలున్నాయని చెప్పుకొచ్చాడు.
తను సంపాదించిన చాలా డబ్బు ఈ రూపంలో పోయిందని తెలిపిన గోపీచంద్, ఎదుటి వ్యక్తి ఆర్థికంగా బాగున్నప్పుడు మాత్రం తన డబ్బులు అడిగి మరీ తీసుకున్న సందర్భాలున్నాయని తెలిపాడు.
ఇక తన రెమ్యూనరేషన్ పై స్పందిస్తూ, ఇప్పటివరకు తను పారితోషికం పెంచలేదని, ప్రతి సినిమాకు నిర్మాతలే తన పారితోషికాన్ని పెంచుతూ వచ్చారని చెప్పుకొచ్చాడు.
ఇక పక్కా కమర్షియల్ సినిమాకు సంబంధించి తన తీసుకున్న పారితోషితమే కెరీర్ హయ్యస్ట్ అని చెప్పుకొచ్చాడు ఈ హీరో. ఈ పెంపు అల్లు అరవింద్ వల్ల సాధ్యమైందని, తను అడగలేదన్నారు.