Telugu Global
NEWS

బాబు చెప్పినట్టే.. రాజధాని భూముల విక్రయం

అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో నిధులు సమీకరించుకునేందుకు సీఆర్‌డీఏ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా వచ్చే నెలలో రాజధాని పరిధిలోని 248 ఎకరాలను విక్రయించేందుకు వేలం వేయనున్నారు. భూముల అమ్మకానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, భూములు అమ్మి అభివృద్ధి చేయవచ్చని చంద్రబాబే స్వయంగా చెప్పడం, హైకోర్టు అభివృద్ధికి ఆదేశించడంతో ప్రభుత్వం ఆ భూములనే అమ్ముతోంది. విడతల వారీగా 600 ఎకరాలను అమ్మాలని […]

బాబు చెప్పినట్టే.. రాజధాని భూముల విక్రయం
X

అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో నిధులు సమీకరించుకునేందుకు సీఆర్‌డీఏ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా వచ్చే నెలలో రాజధాని పరిధిలోని 248 ఎకరాలను విక్రయించేందుకు వేలం వేయనున్నారు. భూముల అమ్మకానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, భూములు అమ్మి అభివృద్ధి చేయవచ్చని చంద్రబాబే స్వయంగా చెప్పడం, హైకోర్టు అభివృద్ధికి ఆదేశించడంతో ప్రభుత్వం ఆ భూములనే అమ్ముతోంది. విడతల వారీగా 600 ఎకరాలను అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా జూలై నెలలో 248 ఎకరాలు వేలం వేయనున్నారు. దీని ద్వారా రూ.2480 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఎకరం రూ.10 కోట్లకు వేలం వేయనున్నారు. ఇంత ధరకు బీడుబారిన అమరావతిలో కొనేందుకు ఎవరు ముందుకొస్తారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

వచ్చే నెలలో వేలం నిర్వహించే భూముల్లో.. గతంలో బీఆర్‌ షెట్టికి చెందిన మెడ్‌సిటీకి కేటాయించిన 100 ఎకరాలు, లండన్ కింగ్స్ కాలేజీ నిర్మాణానికి ఇచ్చిన 148 ఎకరాలు కూడా ఉన్నాయి. ఆ సంస్థలు నిర్మాణాలకు ముందుకు రాకపోవడంతో ఆ భూములను వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వేలంలో భూముల కొనుగోలుకు వచ్చే స్పందన బట్టి వచ్చే ఏడాది మరింత భూమిని ప్రభుత్వం వేలం వేయాలనుకుంటోంది. అయితే అమరావతి భూములను విక్రయించి ఇతర పథకాలకు నిధులు మళ్లిస్తే ఊరుకోబోమని, ఆ నిధులను అమరావతి అభివృద్ధికే వాడాలని అమరావతి రైతులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. నిధులు దారి మళ్లిస్తే కోర్టుకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు.

First Published:  26 Jun 2022 3:30 AM IST
Next Story