సీఎం భగవంత్ మాన్ గెలిచిన స్థానాన్ని కోల్పోయిన ఆప్
పంజాబ్‌లో ఆప్‌కు భారీ షాక్ తగిలింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పంజాబ్‌లో ఘన విజయం సాధించి ఆప్ అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ తరపున భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాగా, ఆయన ఎమ్మెల్యేగా గెలిచి సీఎం కావడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2014, 2019 నుంచి సంగ్రూర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. కాగా, ఆయన రాజీనామా చేసిన సంగ్రూర్ స్థానానికి ఉపఎన్నిక జరుగగా.. ఇవాళ ఓట్ల […]
పంజాబ్‌లో ఆప్‌కు భారీ షాక్ తగిలింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పంజాబ్‌లో ఘన విజయం సాధించి ఆప్ అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.
ఆ పార్టీ తరపున భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాగా, ఆయన ఎమ్మెల్యేగా గెలిచి సీఎం కావడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2014, 2019 నుంచి సంగ్రూర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. కాగా, ఆయన రాజీనామా చేసిన సంగ్రూర్ స్థానానికి ఉపఎన్నిక జరుగగా.. ఇవాళ ఓట్ల లెక్కింపు నిర్వహించారు.
సంగ్రూర్ లోక్‌సభ నుంచి ఆప్ తరపున గుర్మెల్ సింగ్, శరోమణి అకాలీదళ్ తరపున సిమ్రన్ జిత్ మాన్ బరిలో దిగారు. అయితే ఈ ఎన్నికలో ఆప్ అభ్యర్థికి షాక్ ఇస్తూ సిమ్రన్ జిత్ మాన్ 8వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో లోక్‌సభలో ఆప్ ఒక ఎంపీని కోల్పోయినట్లయ్యింది.
కాగా, ఢిల్లీలో మాత్రం ఆప్ పట్టు నిలుపుకున్నది. అక్కడి రాజిందర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆప్అభ్యర్థి దుర్గేశ్ ఘన విజయం సాధించారు. ఆ స్థానానికి ఎమ్మెల్యేగా వ్యవహరించిన రాజీవ్ చద్దాను ఆప్ రాజ్యసభకు నామినేట్ చేసింది. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. అయితే తమ సీటు తామే గెలిచి ఆప్ టాలీని సమం చేసుకున్నది.