ఇంటర్నెట్ సేవల షట్‌డౌన్స్‌పై ఐరాస ఆందోళన
ఎక్కడైనా ఆందోళనలు, ఉద్రిక్తతలు జరుగుతున్నాయంటే తక్షణమే ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం ప్రభుత్వాలకు పరిపాటి. సంఘ విద్రోహక శక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని అరాచకాలకు పాల్పడతాయంటూ చెబుతుంటాయి. అయితే కారణాలు ఏమైనప్పటికీ ఇలా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం సామాన్య ప్రజానీకానికి తీవ్రనష్టం జరుగుతుందనేది మాత్రం వాస్తవం. ఇదే విషయమై ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని వ్యతిరేకించింది. ఇటువంటి షట్ డౌన్ చర్యలకు పాల్పడవద్దంటూ ప్రపంచ దేశాలను కోరింది. ఏవో కారణాలు […]
ఎక్కడైనా ఆందోళనలు, ఉద్రిక్తతలు జరుగుతున్నాయంటే తక్షణమే ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం ప్రభుత్వాలకు పరిపాటి. సంఘ విద్రోహక శక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని అరాచకాలకు పాల్పడతాయంటూ చెబుతుంటాయి.
అయితే కారణాలు ఏమైనప్పటికీ ఇలా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం సామాన్య ప్రజానీకానికి తీవ్రనష్టం జరుగుతుందనేది మాత్రం వాస్తవం. ఇదే విషయమై ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని వ్యతిరేకించింది. ఇటువంటి షట్ డౌన్ చర్యలకు పాల్పడవద్దంటూ ప్రపంచ దేశాలను కోరింది.
ఏవో కారణాలు చూపుతూ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తే ఒక్కోసారి తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితి హక్కుల విభాగం చీఫ్ మిచెల్లే బాచెలెట్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇలా ఈ సేవలను ఆపేయడం ప్రజల హక్కులు, జీవనంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందని ఐరాస పేర్కొంది. శాంతియుతంగా నిరసన తెలియజేసే వారు సాయం కోసం కాల్ చేసుకునే పరిస్థితి ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులు తమ డాక్టర్లను సంప్రదించలేవు.
పోలీసు విభాగం కూడా సమయానుకూలంగా స్పందించలేదు. చేతివృత్తులపై ఆధారపడి జీవించేవారు వారి వ్యాపారాన్ని కొనసాగించలేక నష్టపోతారు. ఇలా పలు రకాలుగా అమాయకులైన వివిధ వర్గాల ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందని ఐరాస వివరించింది.
ప్రజల జీవితాల్లో డిజిటల్ ప్రపంచం ఒక తప్పనిసరి భాగమైందన్నారు. ఈ సేవలను పొందలేకపోవడం మానవ హక్కులను కోల్పోవడమేనని పేర్కొన్నారు. ఇంటర్నెట్ సేవలను ఎక్కువ రోజుల పాటు నిలిపివేయడం ఆర్థిక రంగానికి నష్టకలగడమేగాక వ్యక్తుల మానసిక స్థితి పై కూడా ప్రభావంచూపుతుందని బాచెలెట్ అన్నారు.