Telugu Global
NEWS

బస్సులు చివరకు ఇలా తయారయ్యాయంటూ టీడీపీ ఫేక్ పోస్టు.. చెంప చెల్లుమనిపించేలా ఆర్టీసీ కౌంటర్

ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఆయన పాలనను విమర్శించడమే పనిగా పెట్టుకున్నది టీడీపీ. గత ఎన్నికల్లో ప్రజలంతా భారీగా ఓట్లేసి వైసీపీని గెలిపించినా.. టీడీపీకి మాత్రం సిగ్గుమాత్రం రావడం లేదు. ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రకటించి జనరంజక పాలన అందిస్తున్న జగన్‌పై ప్రతినిత్యం తమ చేతుల్లో ఉన్న మీడియా ద్వారా బురద చల్లిస్తుంటారు. ఇక టీడీపీ సోషల్ మీడియా అయితే నిత్యం ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ పబ్బం […]

బస్సులు చివరకు ఇలా తయారయ్యాయంటూ టీడీపీ ఫేక్ పోస్టు.. చెంప చెల్లుమనిపించేలా ఆర్టీసీ కౌంటర్
X
ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఆయన పాలనను విమర్శించడమే పనిగా పెట్టుకున్నది టీడీపీ. గత ఎన్నికల్లో ప్రజలంతా భారీగా ఓట్లేసి వైసీపీని గెలిపించినా.. టీడీపీకి మాత్రం సిగ్గుమాత్రం రావడం లేదు.
ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రకటించి జనరంజక పాలన అందిస్తున్న జగన్‌పై ప్రతినిత్యం తమ చేతుల్లో ఉన్న మీడియా ద్వారా బురద చల్లిస్తుంటారు. ఇక టీడీపీ సోషల్ మీడియా అయితే నిత్యం ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నది.
ఇలాంటి ఫేక్ వార్తలు నిత్యం వ్యాపింపజేస్తూ అనేక మంది టీడీపీ కార్యక్తలు కేసుల్లో ఇరుక్కుంటున్నా.. ఇంకా బుద్దిరావడం లేదు.
తాజాగా తెలుగు దేశం పొలిటికల్ వింగ్ సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఫేక్ వార్తకు ఏపీఎస్ఆర్టీసీ గట్టి కౌంటర్ ఇచ్చింది. శుక్రవారం సాయంత్రం తమ అకౌంట్‌లో టార్పలిన్ కప్పిన ఆర్టీసీ బస్సు ఫొటో పెట్టి ఒక మీమ్ చేసింది.
ఆర్టీసీ బస్సులు అధ్వాన్నంగా తయారయ్యాయని.. చివరకు టార్పలిన్ కప్పి నడిపించాల్సిన పరిస్థితి ఉందని ఆ పోస్టులో పేర్కొన్నారు. దీనికి చాలా మంది టీడీపీ కార్యకర్తలు ఇష్టానుసారం కామెంట్లు పెట్టారు. ఈ పిక్చర్ వైరల్‌గా మారడంతో జనాలు కూడా నిజమేనేమో అనుకునే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఈ బస్సుకు టార్పాలిన్ ఎందుకు కప్పారో ఏపీఎస్ఆర్టీసీ వివరణ ఇస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది.
‘తెలుగుదేశం పొలిటికల్ వింగ్.. మీరు పోస్టు చేసిన బస్సులో ప్యాసింజర్లు లేరు. అలాగే ఆ బస్సు కప్పుకు ఎలాంటి లీకేజీలు కూడా లేవు.
అయితే ఆ బస్సులో స్కూల్ బుక్స్ రవాణా చేస్తున్నాము. ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌తో ఉన్న ఒప్పందం మేరకు ఆర్టీసీ తమ బస్సుల్లో పుస్తకాలు రవాణా చేస్తున్నది. స్కూల్స్ రీఓపెన్ కాకముందే పాఠశాలలకు పుస్తకాలు చేరవేయాలనే లక్ష్యంతో భారీగా బస్సులను ఏర్పాటు చేసి జిల్లా హెడ్ క్వార్టర్ల నుంచి పాఠశాలలకు పంపిస్తున్నాము. రాజమండ్రి నుంచి కూడా ఇలా కొన్ని బస్సులు ఏర్పాటు చేసి జూన్ 1 నుంచి అన్ని మండల హెడ్ క్వార్టర్లకు పుస్తకాలను చేరవేస్తున్నాము. పుస్తకాలకు ఎలాంటి డ్యామేజీ జరగకుండా.. క్షేమంగా తరలించే ఏర్పాట్లను ఏపీఎస్ ఆర్టీసీ చేసింది. అతి తక్కువ సమయమే ఉండటం, వర్షాకాలం కూడా రావడంతో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాము.
ఈ నేపథ్యంలోనే బస్సు కిటికీలను టార్పలిన్‌లతో కప్పాము. వర్షం నీటి వల్ల పుస్తకాలు పాడవ్వొద్దనే ఇలా చేశాము’ అని పోస్టులో పేర్కొన్నది.
‘తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 25 లక్షల పుస్తకాలను బస్సుల ద్వారా చేరవేశాము. ఈ పుస్తకాలు మీ పిల్లలకు, మీ బంధువుల పిల్లలకు కూడా చేరతాయి. ఇలా అబద్దాలను వ్యాప్తి చేయడం, అసలు కారణం కనుక్కోకుండా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడం మంచిది కాదు.
ప్రభుత్వం చేస్తున్న గొప్ప పనిని ఇలా బద్నాం చేయవద్దు. మీ పోస్టు చూసి మేం షాక్‌కు గురయ్యాము. వెంటనే మీ పోస్టు డిలీట్ చేయండి. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఏపీఎస్ఆర్టీసీ మీపై తగిన చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి పోస్టులు పెట్టినందుకు చట్టప్రకారం ముందకు వెళ్తాము’ అని ఏపీఎస్ ఆర్టీసీ చెంప చెల్లుమనిపించేలా కౌంటర్ ఇచ్చింది.
First Published:  25 Jun 2022 9:45 AM GMT
Next Story