Telugu Global
NEWS

తిరుగుబాటుదారుల‌కు షాక్ ఇస్తున్న శ‌ర‌ద్ ప‌వార్‌

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభ పరిష్కారంలో ఎన్సీపీ నేత శరద్ పవార్ కీలక భూమిక పోషిస్తున్నారు. రెబల్ నేత ఏక్ నాథ్ షిండే తన బలాన్ని పెంచుకుంటుండగా.. పవార్ తన వ్యూహాలతో శివసేనకు, సీఎం ఉద్ధవ్ థాక్రేకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పతనం కాకుండా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పార్టీకే చెందిన డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ ను ఆయన ఎలా ప్రభావితం చేశారంటే.. అజయ్ చౌదరిని శివసేన లెజిస్లేచర్ పార్టీ నేతగా నియమించాలన్న […]

తిరుగుబాటుదారుల‌కు షాక్ ఇస్తున్న శ‌ర‌ద్ ప‌వార్‌
X

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభ పరిష్కారంలో ఎన్సీపీ నేత శరద్ పవార్ కీలక భూమిక పోషిస్తున్నారు. రెబల్ నేత ఏక్ నాథ్ షిండే తన బలాన్ని పెంచుకుంటుండగా.. పవార్ తన వ్యూహాలతో శివసేనకు, సీఎం ఉద్ధవ్ థాక్రేకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.

మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పతనం కాకుండా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పార్టీకే చెందిన డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ ను ఆయన ఎలా ప్రభావితం చేశారంటే.. అజయ్ చౌదరిని శివసేన లెజిస్లేచర్ పార్టీ నేతగా నియమించాలన్న ఈ వర్గం ప్రతిపాదనను జిర్వాల్ ఆమోదించారు. దీంతో అసెంబ్లీలో ఏక్ నాథ్ షిండే స్థానే అజయ్ చౌదరి సేన లెజిస్లేచర్ పార్టీ నేత అయ్యారు. ఇది ఈ ప్రక్రియలో చాలా కీలకం.

ఈ గ్రూప్ లీడరే విప్ ను నియమించడమే గాక సభలో ఎమ్మెల్యేలు ఎలా ప్రవర్తించాలో నిర్ణయిస్తాడు కూడా. ఉద్ధవ్ థాక్రే, పవార్ మధ్య ఫోన్ లో సంభాషణ జరిగిన కొన్ని గంటల్లోనే డిప్యూటీ స్పీకర్ జిర్వాల్.. సేన ప్రతిపాదనను ఆమోదించడం విశేషం. అలాగే షిండేతో బాటు 12 మంది రెబల్ సేన ఎమ్మెల్యేలను సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలన్న ప్రపోజల్ కు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

శరద్ పవార్ సూచనలతో వరుసగా సమావేశాలు జరిగిన అనంతరం .. ఎన్సీపీ నేతలు ప్రఫుల్ పటేల్, అజిత్ పవార్, జయంత్ పాటిల్ వంటివారు ముఖ్యమంత్రి థాక్రేకి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. సంకీర్ణ కూటమి నుంచి సేన వైదొలగే అవకాశాలను పరిశీలిస్తుందని ఈ పార్టీ నేత సంజయ్ రౌత్ చేసిన ప్రకటన నేపథ్యంలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో రకరకాల ఊహాగానాలు రేకెత్తగా.. పవార్ తన మీడియా సమావేశాల్లో వాటికి ఫుల్ స్టాప్ పెట్టేలా చూశారు.

పైగా అసెంబ్లీలోనే బల పరీక్ష జరగాలన్నవిషయంలో పవార్ పట్టు బట్టిన ఫలితంగా షిండేతో బాటు ఆయన వర్గం ఎమ్మెల్యేలు గౌహతిలోనే తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి వీరు ఎన్ని రోజులు అక్కడి హోటల్ లో ఉంటారో తెలియదు. వీళ్లంతా వెంటనే ముంబై తిరిగి వచ్చి అసెంబ్లీకి హాజరు కావాలని పవార్, రౌత్ కోరుతున్నారు. గతంలో కూడా తనిలాంటి ఉదంతాలను చూశానని, ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని శరద్ పవార్ ఖండితంగా చెబుతున్నారు.

లోగడ తన సొంత పార్టీలో చీలికలు తెచ్చేందుకు జరిగిన యత్నాలను ఆయన ప్రస్తావిస్తున్నారు. 2002 లో నారాయణ్ రాణే, 2019 లో తన మేనల్లుడు అజిత్ పవార్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలను పవార్ ఇంకా మరిచిపోలేదు.

ఓ వైపు ఉద్ధవ్ థాక్రే రాజీ ధోరణిలో ఉన్నప్పటికీ ఈయన మాత్రం రెబెల్ సేన ఎమ్మెల్యేల ‘పక్కలో బాంబు’లా తయారయ్యారు. ఇలాంటి తిరుగుబాటుదారులు విజయం సాధించడమన్నది అరుదుగా జరుగుతుందని, ఛగన్ భుజ‌బల్ సహా వెళ్లినవాళ్లలో ఒక్కరు తప్ప ఎన్నికల్లో మళ్ళీ ఎవరూ గెలవలేరని ఆయన పేర్కొన్నారు. రెబల్ ఎమ్మెల్యేలపై లీగల్ చర్యలు తీసుకోవడం అనివార్యమని, ఇవన్నీ తమ బాస్ చూసుకుంటున్నారని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి.

First Published:  25 Jun 2022 12:56 AM GMT
Next Story