Telugu Global
International

గన్స్ వాడకంపై అమెరికాలో కొత్త బిల్లు. ఇందులో ఏముందంటే..

అమెరికాలో తరచూ జరిగే విచ్చలవిడి కాల్పుల నేపథ్యంలో అక్కడి గన్ కల్చర్‌పై కొన్ని ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాలు ఎప్పటినుంచో ఆలోచిస్తున్నాయి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఓ ప్రత్యేకమైన బిల్లును ఆమోదానికి వచ్చింది. ఈ బిల్లులో ఏముందంటే.. అమెరికన్లు ఎదురు చూస్తున్న తుపాకుల నియంత్రణ బిల్లు త్వరలోనే పార్లమెంటు ఆమోదం పొందనుంది. ఎప్పటినుంచో నానుతూ వస్తున్న ఈ బిల్లు గొడవ గురువారం ఒక కొలిక్కి వచ్చింది. గురువారం 15 మంది రిపబ్లికన్లు ఈ బిల్లుకు సమ్మతించడంతో […]

గన్స్ వాడకంపై అమెరికాలో కొత్త బిల్లు. ఇందులో ఏముందంటే..
X

అమెరికాలో తరచూ జరిగే విచ్చలవిడి కాల్పుల నేపథ్యంలో అక్కడి గన్ కల్చర్‌పై కొన్ని ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాలు ఎప్పటినుంచో ఆలోచిస్తున్నాయి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఓ ప్రత్యేకమైన బిల్లును ఆమోదానికి వచ్చింది. ఈ బిల్లులో ఏముందంటే..

అమెరికన్లు ఎదురు చూస్తున్న తుపాకుల నియంత్రణ బిల్లు త్వరలోనే పార్లమెంటు ఆమోదం పొందనుంది. ఎప్పటినుంచో నానుతూ వస్తున్న ఈ బిల్లు గొడవ గురువారం ఒక కొలిక్కి వచ్చింది. గురువారం 15 మంది రిపబ్లికన్లు ఈ బిల్లుకు సమ్మతించడంతో సెనెట్‌లో తుపాకుల నియంత్రణ బిల్లు 65 -33 ఓట్ల తేడాతో నెగ్గింది.

అయితే కొంతమంది రిపబ్లికన్‌ సెనెటర్లు మాత్రం బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అమెరికన్‌ పౌరులకు తుపాకులు ధరించే హక్కును 2వ రాజ్యాంగ సవరణ ఇచ్చిందనీ, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడతామనేది వారి వాదన. అయితే విచ్చలవిడిగా చోటుచేసుకుంటున్న కాల్పులకు అమాయకులు బలవుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఈ బిల్లు ఆమోదం పొందడం సంతోషకరమని మరికొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

బిల్లులో ఏముందంటే…
ఈ కొత్త బిల్లు ప్రకారం ఇకపై 18 నుంచి 20 ఏళ్ల వయసులో తుపాకులు కొనదలిచేవారి నేర రికార్డులను ఫెడరల్‌, స్థానిక అధికారులు పది రోజుల వ్యవధిలో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇది వరకూ ఈ తనిఖీ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తయ్యేది. ఈ కొత్త బిల్లు ప్రకారం గృహ హింసకు పాల్పడిన చరిత్ర ఉన్నవారు.. తుపాకులు కొనడానికి అర్హులు కారు. ఈ బిల్లు ప్రకారం ప్రమాదకర వ్యక్తుల నుంచి తాత్కాలికంగా తుపాకులను స్వాధీనం చేసుకుంటారు. అలాగే తుపాకులను అక్రమ రవాణా చేసేవారికి, ఇతరుల కోసం తుపాకులు కొనేవారికి 25 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు.

First Published:  25 Jun 2022 12:34 PM IST
Next Story