అప్పుడు సీబీఐని తప్పుబట్టారు.. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ని కాదంటున్నారు
తమకు అనుకూలంగా రిపోర్ట్ లు ఇవ్వనప్పుడు కేంద్ర సంస్థల్ని తప్పుబట్టడం టీడీపీకి అలవాటేనన్నారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. టీడీపీ హయాంలో అప్పుడు సీబీఐని తప్పుబట్టారని, ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ని కూడా తప్పు అంటున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలోకంటే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మిన్నగా ఉందని, అప్పుల విషయంలో గతంలో టీడీపీ చేసిన తప్పులన్నిటినీ సరిదిద్దుకుంటూ వస్తున్నామని చెప్పారు. ఎల్లో మీడియాని అడ్డు పెట్టుకుని టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం సరికాదంటూ విమర్శించారు. కోవిడ్ […]
తమకు అనుకూలంగా రిపోర్ట్ లు ఇవ్వనప్పుడు కేంద్ర సంస్థల్ని తప్పుబట్టడం టీడీపీకి అలవాటేనన్నారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. టీడీపీ హయాంలో అప్పుడు సీబీఐని తప్పుబట్టారని, ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ని కూడా తప్పు అంటున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలోకంటే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మిన్నగా ఉందని, అప్పుల విషయంలో గతంలో టీడీపీ చేసిన తప్పులన్నిటినీ సరిదిద్దుకుంటూ వస్తున్నామని చెప్పారు. ఎల్లో మీడియాని అడ్డు పెట్టుకుని టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం సరికాదంటూ విమర్శించారు.
కోవిడ్ వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పాలనలో లోటు రానీయలేదని, సంక్షేమ పథకాలకు ఎక్కడా నిధులు ఆపలేదని వివరించారు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నామని, సామాన్యులకు ఉపయోగపడే పథకాల కోసమే అప్పు చేశామని వివరించారు. ఆర్థిక లోటు ఏర్పడినప్పుడు మాత్రమే అప్పు చేశాం కానీ టీడీపీ లాగా ఆర్థిక పరిస్థితి దివాళా తీసేలాగా తాము అప్పులు చేయలేదన్నారు బుగ్గన. ఆర్థిక సంఘం ఇచ్చిన పరిమితి కంటే తక్కువ అప్పులు చేశామని ఆయన గుర్తు చేశారు.
బాబు హయాంలోనే ఆర్థిక లోటు ఎక్కువ..
చంద్రబాబు హయాంలోనే ఏపీలో ఆర్థిక లోటు ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు దేశంలో ఆర్థిక లోటు తక్కువగా ఉన్న రాష్ట్రాల లిస్ట్ లో ఏపీ ఉందని చెప్పారు బుగ్గన. ఆర్థిక లోటు 2.1కి తగ్గించి బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ గా ఏపీని ముందు వరుసలో నిలిపామని చెప్పారు. చంద్రబాబు హయాంలో 19.46 శాతం పెరిగిన అప్పు.. తమ ప్రభుత్వ హయాంలో 15 శాతానికి తగ్గిందని గుర్తు చేశారు. టీడీపీ పాలనలో బడ్జెట్ అంచనాలకు ఖర్చు మధ్య పొంతన ఉండేది కాదని, కానీ ఇప్పుడలాంటి పరిస్థితులు లేవన్నారు. ఏపీ ఆర్థిక లోటుకి శ్రీలంకకు అసలు సంబంధమేంటని ప్రశ్నించారు బుగ్గన. బ్యాంకులు, ఆర్థిక సంస్థలను భయపెట్టి ఏపీకి అప్పులు రాకుండా అడ్డుకోవాలనే దుర్మార్గానికి టీడీపీ దిగజారిందని విమర్శించారు.