పేపర్ ‘లెస్’ పాకిస్థాన్.. ఘనత అనుకుంటే అది పొరపాటే..!
పాకిస్థాన్ పేపర్ లెస్ గా మారుతోంది. అంటే అత్యవసరానికి మినహా పేపర్ ను వాడటం ఆపేసింది. అయితే ఇదేదో సాంకేతికత కారణంగా వచ్చిన పెను మార్పు, పాకిస్థాన్ ప్రభుత్వం సాధించిన ఘనత అనుకుంటే పొరపాటే. పాకిస్థాన్ పేపర్ లెస్ గా మారడానికి ప్రధాన కారణం అక్కడ ముసురుకున్న ఆర్థిక సంక్షోభం, ఆ దేశంలో కాగితం కొరత. దీంతో కొత్త విద్యాసంవత్సరంలో విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండవని పాకిస్థాన్ పేపర్ అసోసియేషన్ ప్రకటించింది. అంటే పాత పుస్తకాలే […]
పాకిస్థాన్ పేపర్ లెస్ గా మారుతోంది. అంటే అత్యవసరానికి మినహా పేపర్ ను వాడటం ఆపేసింది. అయితే ఇదేదో సాంకేతికత కారణంగా వచ్చిన పెను మార్పు, పాకిస్థాన్ ప్రభుత్వం సాధించిన ఘనత అనుకుంటే పొరపాటే. పాకిస్థాన్ పేపర్ లెస్ గా మారడానికి ప్రధాన కారణం అక్కడ ముసురుకున్న ఆర్థిక సంక్షోభం, ఆ దేశంలో కాగితం కొరత. దీంతో కొత్త విద్యాసంవత్సరంలో విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండవని పాకిస్థాన్ పేపర్ అసోసియేషన్ ప్రకటించింది. అంటే పాత పుస్తకాలే ఈ ఏడాది విద్యార్థులకు దిక్కయ్యే అవకాశముంది.
శ్రీలంక బాటలో..
ఇటీవల శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. నిత్యావసరాల రేట్లు కూడా ఆకాశాన్నంటాయి, పోనీ ధన వంతుల దగ్గర డబ్బులు ఉన్నా కూడా.. అక్కడ వస్తువులు అందుబాటులో లేవు. ఇంచుమించు పాకిస్థాన్ కూడా అలాంటి దురవస్థలోనే ఉంది. ప్రస్తుతం అక్కడ కూడా పాలు, టీ పొడి, చక్కెర వంటి నిత్యావసరాలకి తోడు.. ఇంధన రేట్లు ఎప్పుడూ లేనంత భారీగా పెరిగాయి. శ్రీలంక లాంటి దురవస్థ ఉందని చెప్పలేం కానీ.. పాకిస్థాన్ లో కూడా ప్రజలు అల్లాడిపోతున్నారు, ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు. దీనికి తాజా ఉదాహరణే పేపర్ కొరత.
పాకిస్థాన్ లో కాగితం సంక్షోభం వచ్చింది. స్థానిక పేపర్ పరిశ్రమల గుత్తాధిపత్యం విషయంలో అక్కడి ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటం కూడా మరో కారణం. సింధ్, పంజాబ్, ఖైబర్ ప్రాంతాల్లో పుస్తకాల ముద్రగణ గతంలోనే ఆగిపోయింది. ఆల్ పాకిస్థాన్ పేపర్ మర్చంట్ అసోసియేషన్, పాకిస్థాన్ అసోసియేషన్ ఆఫ్ ప్రింటింగ్ గ్రాఫిక్ ఆర్ట్ ఇండస్ట్రీ తాజాగా దేశవ్యాప్తంగా పుస్తకాల ముద్రణ ఆపేసినట్టు ప్రకటించింది. దేశంలో తీవ్రమైన పేపర్ సంక్షోభం ఉందని, పేపర్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, పేపర్ చాలా ఖరీదైన వస్తువుగా మారుతోందని, ఒకవేళ పుస్తకాలు ముద్రించినా అవి సామాన్యులు కొనేంత తక్కువ రేట్లకు మాత్రం లభ్యం కావని చెబుతున్నారు పేపర్ పరిశ్రమల నిర్వాహకులు.
పరిమితంగా పేపర్ వాడాల్సిందే..
శ్రీలంకలో అన్ని సంక్షోభాలతోపాటే, పేపర్ సంక్షోభం కూడా వచ్చింది. అక్కడ ప్రభుత్వ అవసరాలకు కూడా పేపర్ దొరకడంలేదు. ఆ కారణంతోనే విద్యార్థులకు పరీక్షలు కూడా పెట్టలేదు. ప్రస్తుతం పాకిస్థాన్ కూడా ఇదే స్టేజ్ లో ఉంది. ఇప్పుడు పుస్తకాల ముద్రణ సాధ్యం కాదంటున్నారు.. కొన్ని రోజులకు పరీక్ష పేపర్ ముద్రణ కూడా కష్టమని తేల్చేసే అవకాశముంది. మరి ఈ పేపర్ లెస్ విధానాలను ప్రజలు ఎలా అలవాటు చేసుకుంటారో చూడాలి.