ఆ డెబ్భైమంది ఎమ్మెల్యేలకు జగన్ ఝలక్
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరగుతాయనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ పై ఫోకస్ పెట్టారు. రెండు సార్లు ఎమ్మెల్యేలందర్నీ కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో మొత్తం సీట్లన్నీ సాధించాలని, అందుకు అంతా గట్టిగా కృషి చేయాలని ఆదేశించారు. గట్టిగా కృషి చేస్తే అదేమంత కష్టం కాదని కూడా వారిని ప్రోత్సహించారు. ఈ టార్గెట్ సాధించేందుకు వీలుగానే ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటు చేశారని కూడా వినిపిస్తోంది. ఎన్నికల సంసిద్ధతలో భాగంగా ఎన్నికల […]
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరగుతాయనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ పై ఫోకస్ పెట్టారు. రెండు సార్లు ఎమ్మెల్యేలందర్నీ కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో మొత్తం సీట్లన్నీ సాధించాలని, అందుకు అంతా గట్టిగా కృషి చేయాలని ఆదేశించారు. గట్టిగా కృషి చేస్తే అదేమంత కష్టం కాదని కూడా వారిని ప్రోత్సహించారు.
ఈ టార్గెట్ సాధించేందుకు వీలుగానే ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటు చేశారని కూడా వినిపిస్తోంది. ఎన్నికల సంసిద్ధతలో భాగంగా ఎన్నికల విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ బృందంతో సర్వేలు జరిపించారు. ఆయన నివేదిక ప్రకారం.. దాదాపు 70 మంది ఎమ్మెల్యేలపై వారి నియోకవర్గాల్లో పూర్తి వ్యతిరేకత ఉన్నట్లు వెల్లడైందని చెబుతున్నారు. ఈవిషయంపై ముఖ్యమంత్రి జగన్ చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.
వచ్చే యేడాది మార్చినాటికి ఎన్నికలకు వెళ్ళానుకుంటున్న తరుణంలో దాదాపు సగం మందిఎమ్మెల్యల పై వ్యతిరేక నివేదికలు రావడంతో వారి పట్ల ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. వ్యతిరేకత ఉందంటున్న ఎమ్మెల్యేలను పిలిపించుకుని సీరియస్ వార్నింగ్ ఇచ్చారని తెలిసింది.
ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన గడప గడప కు కార్యక్రమంలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అంతకు ముందు నుంచీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈ కార్యక్రమం సందర్భంగా మరింత పెరిగిందంటున్నారు.
దీంతో కొందరు ఈ కార్యక్రమానికి డుమ్మా కొడుతున్నారు. మరికొందరు నామమాత్రంగా వెళ్ళామంటే వెళ్ళామనిపిస్తున్నారని ముఖ్యమంత్రికి సమాచారం ఉందంటున్నారు. అందుకనే ఆయన ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించి అటువంటి ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎన్నికల నాటికి ఈ ఎమ్మెల్యేలు తమ పరపతిని పెంచుకోకపోతే టిక్కెట్లు ఇచ్చేది లేదని, వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇస్తానని కరాఖండీగా చెప్పినట్టు ఆ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అలా తమ గ్రాఫ్ ను పెంచుకోగలిగిన వారి పేర్లను తొలి జాబితాలోనే ప్రకటిస్తానని చెప్పారట.
అన్ని అనుకున్నట్లు జరిగితే నవంబర్లోనే అసెంబ్లీ రద్దు చేసి వచ్చే ఏడాది మార్చికి ఎన్నికలు ఉండేలా జగన్ ప్లాన్ చేస్తున్నారని ముఖ్యనేతలు, మిగిలిన పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి.