Telugu Global
CRIME

డేటింగ్ యాప్ మాయలో పడి రూ. 6 కోట్లు మోసపోయిన బ్యాంక్ మేనేజర్

సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎంతో మంది భారీగా సొమ్ములు కోల్పోతున్నారు. భవిష్యత్ అవసరాల కోసం దాచి పెట్టుకున్న డబ్బును కూడా ఈ నేరగాళ్లు చాకచక్యంగా కొట్టేస్తుండటంతో ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. దీంతో పోలీసులు, బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను, వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నాయి. కానీ స్వయంగా ఒక బ్యాంకు మేనేజరే సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ. 6 కోట్ల మేర చెల్లించుకున్నాడంటే నమ్ముతామా? కానీ, ఇది నిజం. బెంగళూరులో చోటు చేసుకున్న ఈ […]

డేటింగ్ యాప్ మాయలో పడి రూ. 6 కోట్లు మోసపోయిన బ్యాంక్ మేనేజర్
X

సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎంతో మంది భారీగా సొమ్ములు కోల్పోతున్నారు. భవిష్యత్ అవసరాల కోసం దాచి పెట్టుకున్న డబ్బును కూడా ఈ నేరగాళ్లు చాకచక్యంగా కొట్టేస్తుండటంతో ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి.

దీంతో పోలీసులు, బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను, వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నాయి. కానీ స్వయంగా ఒక బ్యాంకు మేనేజరే సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ. 6 కోట్ల మేర చెల్లించుకున్నాడంటే నమ్ముతామా? కానీ, ఇది నిజం. బెంగళూరులో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కర్ణాటకలోని ఒక ప్రముఖ బ్యాంకులో హరిశంకర్ అనే వ్యక్తి మేనేజర్‌గా పని చేస్తున్న వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు. మంచి జీతంతో పాటు సమాజంలో అతడికి మంచి పేరు కూడా ఉన్నది. సాఫీగా సాగిపోతున్న అతడి జీవితంలోకి డేటింగ్ యాప్ అల్లకల్లోలం సృష్టించింది.

సదరు మేనేజర్ సరదాగా తన ఫోన్‌లో డేటింగ్ యాప్ డైన్‌లోడ్ చేసుకున్నాడు. నిత్యం అందులో అమ్మాయిల ఫొటోలు చూస్తూ ఇష్టమైన వారికి రిక్వెస్ట్ పెట్టేవాడు. ఈ క్రమంలో ఒక మహిళ అతడికి పరిచయం అయ్యింది. చాన్నాళ్ల పాటు చాటింగ్ చేసుకున్న తర్వాత వీడియో కాల్స్ వరకు వారి వ్యవహారం వెళ్లింది.

ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమ పెరగడంతో ఒక రోజు కలిసి వ్యాపారం చేద్దామని ఆ మహిళ ప్రతిపాదించింది. వెంటనే హరిశంకర్ తన సొంత డిపాజిట్లను నగదుగా మార్చి రూ. 12 లక్షలు ఆమెకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తర్వాత వ్యాపారం చేయడానికి ఈ సొమ్ము సరిపోదని.. మరింత డబ్బు కావాలని ఆమె కోరింది.

అప్పటికే సదరు మహిళ మాయలో పూర్తిగా పడిపోయిన హరి శంకర్ తానేమి చేస్తున్నాడనే విషయాన్ని కూడా మర్చిపోయాడు. బ్యాంకులో అనిత అనే సీనియర్ సిటిజన్ ఖాతాలో ఉన్న రూ.5.69 కోట్ల డిపాజిట్లను రుణం పేరుతో సదరు మహిళకు పలు దఫాలుగా ట్రాన్స్‌ఫర్ చేశాడు. అయితే అనితకు దీనికి సంబంధించిన మెసేజెస్ వెళ్లాయి. వెంటనే బ్యాంకుకు వెళ్లి విచారించగా అసలు విషయం బయటపడింది.

అనిత తన ఖాతాలోంచి డబ్బులు మాయం అవడంపై సదరు మేనేజర్, బ్యాంకుపై పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే, హరి శంకర్ తన డబ్బును తిరిగి ఇవ్వాలని సదరు మహిళకు కాల్ చేయగా ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉన్నది. హరిశంకర్ డబ్బు బదిలీ వ్యవహారంలో బ్యాంకులో పని చేసే మరో ఉద్యోగికి కూడా సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని, సదరు మహిళ కోసం గాలిస్తున్నారు.

కాగా, కస్టమర్లకు జాగ్రత్తగా ఉండాలని చెప్పాల్సిన మేనేజరే.. సైబర్ నేరగాళ్ల వలలో పడి.. తన డబ్బును మాత్రమే కాకుండా, బ్యాంకు ఖాతాదారుల సొమ్మును కూడా పోగొట్టడంపై అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  25 Jun 2022 10:54 AM IST
Next Story