Telugu Global
National

ఏడాది తరువాత హేట్ స్పీచ్ శాంపిల్స్ సేకరించిన పోలీసులు

ఎక్కడైనా ద్వేషపూరిత ప్రసంగాలు చేసినవారిపై పోలీసులు కేసు పెట్టడం సహజం.. అలాగే ఎవరైనా అలా మాట్లాడినవారిపై ఫిర్యాదు చేస్తే.. దర్యాప్తులో భాగంగా సదరు వక్త నిజంగా అలా అన్నారా అని ఖాకీలు సాధ్యమైనంత త్వరగా ఆ ప్రసంగం తాలూకు శాంపిల్స్ సేకరిస్తారు. కానీ ఓ కేసులో కారణం ఏమిటో గానీ మరీ రోజులు, నెలల తరబడి జాప్యం చేశారు ఢిల్లీ పోలీసులు.. ఈ సందర్భంగా దాస్నా ఆలయ పూజారి యతి నరసింఘానంద్ సరస్వతి గురించి ప్రస్తావించుకోవాలి. గత […]

ఏడాది తరువాత హేట్ స్పీచ్ శాంపిల్స్ సేకరించిన పోలీసులు
X

ఎక్కడైనా ద్వేషపూరిత ప్రసంగాలు చేసినవారిపై పోలీసులు కేసు పెట్టడం సహజం.. అలాగే ఎవరైనా అలా మాట్లాడినవారిపై ఫిర్యాదు చేస్తే.. దర్యాప్తులో భాగంగా సదరు వక్త నిజంగా అలా అన్నారా అని ఖాకీలు సాధ్యమైనంత త్వరగా ఆ ప్రసంగం తాలూకు శాంపిల్స్ సేకరిస్తారు. కానీ ఓ కేసులో కారణం ఏమిటో గానీ మరీ రోజులు, నెలల తరబడి జాప్యం చేశారు ఢిల్లీ పోలీసులు.. ఈ సందర్భంగా దాస్నా ఆలయ పూజారి యతి నరసింఘానంద్ సరస్వతి గురించి ప్రస్తావించుకోవాలి.

గత ఏడాది ఏప్రిల్ 1 న ఆయన ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో హేట్ స్పీచ్ ఇచ్చారట. ఆ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త పట్ల , ఇస్లాం మీదా అనుచిత వ్యాఖ్యలు చేశారట. దీనిపై కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

అయితే ఆయన నిజంగా ఇలా మాట్లాడారా అన్నది తెలుసుకునేందుకు ఆయన వాయిస్ శాంపిల్స్ ని సేకరించదలచారు ఖాకీలు.. ఇందుకు మీ గొంతు నమూనాలు ఇవ్వాలని ఏడాది కాలంగా ఎన్నిసార్లు కోరినా ఆరోగ్య కారణాలు సాకుగా చూపి ఆయన పోలీసుల ఎదుట గైర్ హాజరవుతూ వచ్చారు.

మరో మతంపట్ల ద్వేషపూరితంగా రెచ్చగొట్టే ధోరణిలో వ్యాఖ్యలు చేశారని, సెంటిమెంట్లను గాయపరచారంటూ వివిధ సెక్షన్ల కింద యతి నరసింఘానంద్ సరస్వతి మీద కేసు దాఖలయింది. ఆయన స్పీచ్ సోషల్ మీడియా వేదికల్లో సర్క్యులేట్ కావడంతో పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ లో కేసు పెట్టామని ఓ అధికారి తెలిపారు. కానీ ఇంకా ఆయనపై ఛార్జ్ షీట్ దాఖలు కాలేదని, అరెస్టు చేయలేదని చెప్పారు.

గత మే నెల చివరి వారంలో యతి నరసింఘానంద్ పోలీసు స్టేషనుకు వచ్చి తన వాయిస్ శాంపిల్స్ ఇచ్చారని, దాన్ని విశ్లేషణకుగాను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపామని ఆయన చెప్పారు. ఇదే సమయంలో దర్యాప్తు యధాప్రకారం జరుగుతోందని, ప్రెస్ క్లబ్ లోఆయన చేసిన ప్రసంగంతో ఈ శాంపిల్ మ్యాచ్ అవుతుందని భావిస్తున్నామన్నారు. ఆ నాడు ఆయన గంటసేపు ఇచ్చిన స్పీచ్ రికార్డయిందన్నారు. మరో ఎఫ్ ఐ ఆర్ లో కూడా ఈయన పేరును ఖాకీలు చేర్చారు.

తాజాగా ఇది మూడవది. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగిన తరువాత.. ఈయన కూడా అలాగే ద్వేషపూరితంగా మాట్లాడారని పోలీసులు కేసు పెట్టారు. మరో 30 మందిని సైతం నిందితులుగా పేర్కొన్నారు. పైగా బురారీ హిందూ మహాపంచాయత్ నిర్వహించిన కార్యక్రమంలోనూ యతి నరసింఘానంద్ హీట్ స్పీచ్ ఇచ్చారని గత ఏప్రిల్ 3 న వారు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

ఇక ఈ కేసుకు సంబంధించి హిందూ ఫోర్స్ అనే హిందూ సంస్థ అధ్యక్షుడు దీపక్ హిందూ ప్రసంగాన్ని కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 10 న ఆయన స్టేట్మెంట్ ని నమోదు చేశారు. మొత్తానికి తాను సత్యమే మాట్లాడానని, తనమీద తప్పుడు కేసులు పెట్టారని యతి ఆరోపించారు. . ‘ ఏమైనా.. నా వాయిస్ శాంపిల్ పోలీసులకు ఇచ్చాను.. ఈ కేసు దర్యాప్తులో వారికి సహకరిస్తున్నాను’ అని చెప్పారాయన.

First Published:  25 Jun 2022 8:37 AM IST
Next Story