హైదరాబాద్‌లో నలుగురిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసిన గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్
మైలార్‌దేవ్‌పల్లి శాస్త్రిపురంలోని కింగ్స్ కాలనీలో ఓ గోల్డ్ స్మగ్లింగ్ గ్యాగ్ సభ్యులు నలుగురిని కిడ్నాప్ చేసి, నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గుర్తు తెలియని ఓ గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్ పదిహేను రోజుల క్రితం…దుబాయ్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేసేందుకు షాబాజ్, అయ్యాజ్, ఫహద్ అనే ముగ్గురు యువకులను దుబాయ్ కి పంపించింది. ఆ ముఠా ఈ యువకులకు అన్ని రకాల వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసింది. వారం రోజుల […]
మైలార్‌దేవ్‌పల్లి శాస్త్రిపురంలోని కింగ్స్ కాలనీలో ఓ గోల్డ్ స్మగ్లింగ్ గ్యాగ్ సభ్యులు నలుగురిని కిడ్నాప్ చేసి, నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. వివరాల్లోకి వెళ్తే..
గుర్తు తెలియని ఓ గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్ పదిహేను రోజుల క్రితం…దుబాయ్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేసేందుకు షాబాజ్, అయ్యాజ్, ఫహద్ అనే ముగ్గురు యువకులను దుబాయ్ కి పంపించింది.
ఆ ముఠా ఈ యువకులకు అన్ని రకాల వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసింది. వారం రోజుల పాటు వారి ఖర్చుల కోసం స్థానిక కరెన్సీలో పాకెట్ మనీని కూడా ఇచ్చింది. దుబాయ్‌లో ఉన్న ఇదే ముఠాలోని మరికొందరు సభ్యులు ఈ ముగ్గురు యువకులకు ఒక్కొక్కరి కాళ్లకు రెండు కిలోల బంగారాన్ని పేస్టు రూపంలో అమర్చారు. దాన్ని హైదరాబాద్ తీసుకుళ్ళాలని ఆదేశించారు.
అందులో ఇద్దరు అయ్యాజ్, షాబాజ్ లు ఫ్లైట్ ద్వారా హైదరాబాద్ చేరుకొని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ చెకింగ్ నుండి తప్పించుకొని బైటపడ్డారు. ఫహద్ మాత్రం ఫ్లైట్ ఎక్కకుండా దుబాయ్ లోనే ఉండిపోయాడు. దాంతో హైదరాబాద్‌లోని స్మగ్లింగ్ ముఠా, ఫహద్ తండ్రి అహ్మద్ షరీఫ్, అతని బంధువు ఆసిమ్, అయ్యాజ్, షాబాజ్‌లను కిడ్నాప్ చేసి ఓ ఇంట్లో బంధించి, మిగిలిన బంగారం గురించి అడుగుతూ హింసించారు.
రెండురోజుల చిత్ర హింసల తర్వాత దుండగులు ఫహద్ తండ్రి షరీఫ్ మినహా ఇతరులను విడిచిపెట్టారు.
వారి చెరనుండి బైటపడ్డవాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సనత్‌నగర్ పోలీసులు షరీఫ్ ను రక్షించారు. గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్ పరారీలో ఉంది. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.