Telugu Global
National

రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికతో గిరిజన ఓట్లకు బీజేపీ గాలం

రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడంలో బీజేపీ ఆచితూచి వ్యవహరించింది. గిరిజన మహిళ, పైగా అపారంగా రాజకీయ అనుభవం ఉన్న ఆమెను రాష్ట్రపతి చేస్తే రాజకీయంగా తమకెంతో లాభిస్తుందన్నది ఈ పార్టీ యోచన. ఆదివాసీ ఓటర్లను పూర్తిగా గుప్పిట్లో పెట్టుకోవడానికి ఈ నిర్ణయం పార్టీకి దోహదపడుతుందన్నదే లక్ష్యం. . ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ. నడ్డా, ఇతర ప్రముఖుల సమక్షంలో ద్రౌపది ముర్ము నిన్న తమ నామినేషన్ దాఖలు చేశారు. ఒడిశాలో […]

రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికతో గిరిజన ఓట్లకు బీజేపీ గాలం
X

రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడంలో బీజేపీ ఆచితూచి వ్యవహరించింది. గిరిజన మహిళ, పైగా అపారంగా రాజకీయ అనుభవం ఉన్న ఆమెను రాష్ట్రపతి చేస్తే రాజకీయంగా తమకెంతో లాభిస్తుందన్నది ఈ పార్టీ యోచన.

ఆదివాసీ ఓటర్లను పూర్తిగా గుప్పిట్లో పెట్టుకోవడానికి ఈ నిర్ణయం పార్టీకి దోహదపడుతుందన్నదే లక్ష్యం. . ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ. నడ్డా, ఇతర ప్రముఖుల సమక్షంలో ద్రౌపది ముర్ము నిన్న తమ నామినేషన్ దాఖలు చేశారు. ఒడిశాలో సంథాల్ తెగకు చెందిన గిరిజన మహిళ. ఈమె దేశ జనాభాలో గిరిజనుల సంఖ్య సుమారు 8.6 శాతం ఉంది.

వీరిని తమ ఓట్ల ‘పెట్టని కోట’గా మలచుకోవాలి.. ఇందుకు అనువుగా ముర్మును ఉపయోగించుకోవాలి..ఇదీ కమలనాథుల ఉద్దేశం.. ఆదివాసీ తెగలతో నెట్ వర్క్ ని పెంచుకోవాలన్నది కొన్నేళ్లుగా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ.

ఇందులో భాగంగానే బీజేపీ పావులు కదిపింది. ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడంతోను, గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో వారి ఓట్లను రాబట్టుకోవాలన్న లక్ష్యంతోను ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు.

రాజకీయంగా ఏర్పడిన నష్టాలను భర్తీ చేసుకోవాలంటే.. ముఖ్యంగా గుజరాత్ లో జరిగే ఎన్నికల్లో తమ స్థానాన్ని మరింత దృఢతరం చేసుకోవాలంటే బీజేపీకి ఈ నిర్ణయం తీసుకోక తప్పదు. ఈ రాష్ట్ర జనాభాలో ఎస్టీల సంఖ్య దాదాపు 14.8 శాతం ఉంది. అలాగే 26.8 శాతం ఆదివాసీ జనాభా ఉన్న ఝార్ఖండ్ రాష్ట్రాన్ని కూడా ‘కైవసం’ చేసుకోవాలన్నది బీజేపీ యోచన. ఈ రాష్ట్రంలో 2024 లో ఎన్నికలు జరగాల్సి ఉంది.

ఇక ఛత్తీస్ గడ్ కూడా పార్టీ దృష్టిలో ఉంది. 30.6 శాతం గిరిజన జనాభా ఉన్న ఛత్తీస్ గఢ్ లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో గిరిజనుల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉందని, కానీ గిరిజనేతరుడైన రఘువర్ దాస్ ని సీఎంగా పార్టీ ఎంపిక చేసిందని పార్టీ నేత ఒకరు చెప్పారు. పలు క్లిష్టతరమైన సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని, పైగా తమకు ప్రాతినిధ్యం లేదన్న భావన గిరిజనుల్లో ఏర్పడడంతో సమస్య మరింత పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఎస్సీలు, ఎస్టీల సామాజికవర్గాలనుంచి ప్రతిభగల వారిని బీజేపీ ఎంపిక చేసుకోవలసి ఉంది. గిరిజన స్వాతంత్య్ర సమర యోధుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు.. కానీ బీజేపీ మాత్రమే గిరిజన నాయకత్వాన్ని గుర్తించింది .. ఈ కారణంగానే ద్రౌపది ముర్మును ఎంపిక చేసిందంటే వీరిపట్ల పార్టీకి గల గౌరవమే దీన్ని ప్రతిబింబిస్తోందని బీజేపీ నేత. రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు సమీర్ ఓరాన్ వ్యాఖ్యానించారు. ..

ఇక 1977 లో జనతా పార్టీలో చేరిన రఘువర్ దాస్.. మూడేళ్ళ తరువాత.. 1980లో బీజేపీలో చేరారు. నిజానికి నాడు ఈయన పార్టీ వ్యవస్థాపక నేతల్లో ఒకరుగా మారారు. అప్పటి నుంచి పార్టీలో పలు పదవులు నిర్వర్తించారు. 2014 లో ఈయన రాజకీయ కెరీర్ మరింత ఉన్నత స్థానానికి చేరింది. అప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా.. ఈయనను పార్టీ ఉపాధ్యక్షునిగా చేశారు. నాటి ఎన్నికల ర్యాలీల్లో రఘువర్ దాస్ .. ప్రధాని మోడీకి అండగా ఉండి ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలో తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును పార్టీ ఎంపిక చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటో తెలుస్తూనే ఉంది.

First Published:  25 Jun 2022 6:27 AM IST
Next Story