ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ జీవో విడుదల.. ఎవరి జీతం ఎంతంటే?
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించిన జీవోను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. రెండేళ్ల ప్రొబేషన్ పిరియడ్ పూర్తిచేసుకొని, డిపార్ట్‌మెంటల్ పరీక్ష కూడా పాస్ అయిన వారికి ఈ జీవో ప్రకారం జీతాలు అందనున్నాయి. జీవో నెంబర్ 5 ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేసే అధికారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. ఈ జీవోకు సంబంధించిన ఉత్తర్వుల జారీకి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాలా రోజుల […]
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించిన జీవోను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. రెండేళ్ల ప్రొబేషన్ పిరియడ్ పూర్తిచేసుకొని, డిపార్ట్‌మెంటల్ పరీక్ష కూడా పాస్ అయిన వారికి ఈ జీవో ప్రకారం జీతాలు అందనున్నాయి. జీవో నెంబర్ 5 ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేసే అధికారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు.
ఈ జీవోకు సంబంధించిన ఉత్తర్వుల జారీకి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాలా రోజుల క్రితమే ఆమోదం తెలుపుతూ సంతకం చేశారు. అయితే, ఆత్మకూరు ఉప ఎన్నిక నేపథ్యంలో కోడ్ అమలులో ఉంది. శుక్రవారం పోలింగ్ పూర్తికావడంతో ఇవాళ జీవో జారీ చేసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో నాలుగైదు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలకు ఉద్యోగులను నియమించారు. ప్రొబేషన్ పూర్తి చేసుకున్న వారికి పే స్కేల్ అమలు చేస్తామని కూడా చెప్పారు. ఈ క్రమంలో జూన్ నెలాఖరుకు ప్రొబేషన్ డిక్లేర్ చేసి జూలై నుంచి కొత్త జీతాలు అమలు చేయనున్నారు. అనగా, ఆగస్టులో వీరందరూ కొత్త జీతాలు అందుకుంటారని ప్రభుత్వం చెబుతుంది.
ఎవరి జీతం ఎంత?
– పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ -5 (రూ. 23,120 – రూ. 74,770)
– పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ -6 డిజిటల్ అసిస్టెంట్ (రూ. 22,460 – రూ. 72,810)
– వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ – (రూ. 22,460 – రూ. 72,810)
– విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్-2 (రూ. 22,460 – రూ. 72,810)
– విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ (రూ. 22,460 – రూ. 72,810)
– విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్ (రూ. 22,460 – రూ. 72,810)
– ఆనిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ (రూ. 22,460 – రూ. 72,810)
– విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ (రూ. 22,460 – రూ. 72,810)
– ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ – 2 (రూ. 22,460 – రూ. 72,810)
– విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ 2/ వార్డ్ రెవెన్యూ సెక్రటరీ (రూ. 22,460 – రూ. 72,810)
– విలేజ్ సర్వేయర్ గ్రేడ్ – 3 (రూ. 22,460 – రూ. 72,810)
– వార్డ్ అడ్మినిస్ట్రేటీవ్ సెక్రటరీ (రూ. 23,120 – రూ. 74,770)
– వార్డ్ శానిటైజేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ గ్రేడ్ – 2 (రూ. 22,460 – రూ. 72,810)
– వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ (రూ. 22,460 – రూ. 72,810)
– వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ గ్రేడ్ – 2 (రూ. 22,460 – రూ. 72,810)
– వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ (రూ. 22,460 – రూ. 72,810)
– వార్డ్ ఎమ్నిటీస్ సెక్రటరీ గ్రేడ్-2 (రూ. 22,460 – రూ. 72,810)
– ఎఎన్ఎం గ్రేడ్-3/వార్డ్ హెల్త్ సెక్రటరీ (రూ. 22,460 – రూ. 72,810)
– గ్రామ/వార్డు మహిళ సంరక్షణ కార్యదర్శి గ్రేడ్-3 (రూ. 22,460 – రూ. 72,810)