Telugu Global
International

అమెరికాలో తుపాకీ సంస్కృతికి కళ్లెం ? గన్ కంట్రోల్ బిల్లుకు సెనేట్ ఆమోదం

అమెరికాలో తుపాకీ సంస్కృతికి కళ్లెం వేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. దేశంలో పెరిగిపోతున్న గన్ వయొలెన్స్ ఘటనలను ఇకనైనా అదుపు చేసేందుకు నడుం కట్టింది. ఈ మేరకు గన్ కంట్రోల్ బిల్లుకు సెనేట్ ఆమోదముద్ర వేసింది. 28 ఏళ్ళ తరువాత మొదటిసారిగా సెనేట్ ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అనుకూలంగా 65 మంది, ప్రతికూలంగా 33 మంది సభ్యులు ఓటు చేసినట్టు బీబీసీ వెల్లడించింది. ఇక ఈ బిల్లును ప్రతినిధుల సభకు పంపుతారు. […]

Gun Control
X

అమెరికాలో తుపాకీ సంస్కృతికి కళ్లెం వేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. దేశంలో పెరిగిపోతున్న గన్ వయొలెన్స్ ఘటనలను ఇకనైనా అదుపు చేసేందుకు నడుం కట్టింది. ఈ మేరకు గన్ కంట్రోల్ బిల్లుకు సెనేట్ ఆమోదముద్ర వేసింది. 28 ఏళ్ళ తరువాత మొదటిసారిగా సెనేట్ ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అనుకూలంగా 65 మంది, ప్రతికూలంగా 33 మంది సభ్యులు ఓటు చేసినట్టు బీబీసీ వెల్లడించింది. ఇక ఈ బిల్లును ప్రతినిధుల సభకు పంపుతారు. కొత్త బిల్లు ప్రకారం..

దేశంలో ఎవరికి పడితే వారికి సులభంగా గన్స్ లభించవు.ముఖ్యంగా 21 ఏళ్ళ లోపు వయస్సువారికి ఆయుధాలు లభించకుండా కఠినమైన నిబంధనలు తేనున్నారు. పైగా విద్యార్థులు, యువకుల మెంటల్ హెల్త్ (మానసిక ఆరోగ్య పరిస్థితులు) హింసాపథం వైపు మళ్లకుండా చేపట్టే కార్యక్రమాలకు 11 బిలియన్ డాలర్లు, స్కూల్ సేఫ్టీ కార్యక్రమాలకు 2 బిలియన్ డాలర్లను కేటాయించాలని కూడా ఈ బిల్లులో నిర్దేశించారు. అలాగే ప్రజలకు లేదా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ముప్పుగా పరిణమించేవారినుంచి తుపాకులను, గన్స్ ను స్వాధీనం చేసుకోవడానికి ఉద్దేశించి ‘రెడ్ ఫ్లాగ్’ చట్టాలను అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహక నిధులివ్వాలని కూడా ప్రతిపాదించారు.గన్ కంట్రోల్ అన్నది అసాధ్యమని కొన్ని వారాల క్రితం కూడాచాలామంది భావించారని, కానీ అమెరికా సెనేట్ దీన్ని సాధ్యమని చేసి చూపిందని ..

ఈ బిల్లు ఆమోదం అనంతరం డెమాక్రాటిక్ మెజారిటీ లీడర్ చుక్ షూమర్ అన్నారు. కామన్ సెన్స్, బైపార్టిసన్, లైఫ్ సేవింగ్ అన్న మూడు అంశాల ప్రాతిపదికన ఈ బిల్లును గురువారం రాత్రి సభ ఆమోదించిందన్నారు.

నేషనల్ రైఫిల్ అసోసియేషన్ తో బాటు పలువురు రిపబ్లికన్లు దీన్ని వ్యతిరేకించినప్పటికీ దేశంలో పెరుగుతున్న హింసను అణచివేయడానికి ఇలాంటి బిల్లు అవసరమని సెనేటర్లు భావించారు. ఇది చరిత్రాత్మక దినమని డెమాక్రాట్ క్రిస్ మర్ఫీ అభివర్ణించారు.

మూడు దశాబ్దాల్లో కాంగ్రెస్ ఆమోదించిన యాంటీ గన్ వయొలెన్స్ బిల్లు ఇదని, ఇది గణనీయమైన ‘చర్య’ అని ఆయన పేర్కొన్నాడు. చివరిసారిగా 1964 లో ఫెడరల్ గన్ కంట్రోల్ చట్టాన్ని తెచ్చారు. అయితే గన్ వయొలెన్స్ ఘటనలు పెరిగినా దీనిపై ఎవరూ సీరియస్ గా దృష్టి సారించలేదు.

తాజాగా బిల్లును సెనేట్ ఆమోదించడంపై అధ్యక్షుడు జోబైడెన్ స్పందిస్తూ ఈ రాత్రి మేం సాధించాం అని వ్యాఖ్యానించారు. ఇటీవల టెక్సాస్, న్యూయార్క్ సిటీల్లో జరిగిన కాల్పుల ఘటనలను ఆయన ప్రస్తావించారు. వివిధ కాల్పుల సంఘటనల్లో తమ వారిని కోల్పోయిన అనేక కుటుంబాల డిమాండ్లకు ఎంపీలు స్పందించారని ఆయన అన్నారు.

ఇక ఈ బిల్లును ప్రతినిధుల సభ పరిశీలించవలసి ఉంది. సభ దీన్ని ఆమోదించాక చట్టంగా దీనిపై బైడెన్ సంతకం చేస్తారు. ఇకపై స్కూళ్లలో మన పిల్ల లు సురక్షితంగా ఉంటారని భావిస్తాను అన్నారాయన. టెక్సాస్ లోని స్కూల్లో 18 ఏళ్ళ యువకుడు జరిపిన కాల్పుల్లో 19 మంది పిల్లలు, ఇద్దరు టీచర్లు మరణించిన సంగతి తెలిసిందే. పర్మిట్ లేకుండా గన్స్ ని వాడరాదనే న్యూయార్క్ స్టేట్ చట్టాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చడాన్ని కూడా బైడెన్ తీవ్రంగా ఖండించారు. ఈ రూలింగ్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు.

First Published:  24 Jun 2022 10:12 AM IST
Next Story