Telugu Global
National

శరద్ పవార్‌ని ఆ మంత్రి బెదిరిస్తున్నారు. – సంజయ్ రౌత్

కేంద్రమంత్రి ఒకరు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ని బెదిరిస్తున్నారని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. మొదట ఆ మంత్రి ఎవరో పేరు చెప్పని ఆయన. ఆ తరువాత బీజేపీ నేత, కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఇలా బెదిరింపులకు దిగుతున్నారని ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కాపాడేందుకు యత్నిస్తే పవార్ ని ఇంటికి వెళ్లనివ్వబోమని రాణే హెచ్చరించారని, కానీ ఈ ప్రభుత్వం ఉన్నా, పడిపోయినా పవార్ పట్ల ఈ విధమైన భాషను ఉపయోగించడం తగదని రౌత్ […]

sharad-pawar--shivsena-mp-sanjay-raut
X

కేంద్రమంత్రి ఒకరు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ని బెదిరిస్తున్నారని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. మొదట ఆ మంత్రి ఎవరో పేరు చెప్పని ఆయన. ఆ తరువాత బీజేపీ నేత, కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఇలా బెదిరింపులకు దిగుతున్నారని ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కాపాడేందుకు యత్నిస్తే పవార్ ని ఇంటికి వెళ్లనివ్వబోమని రాణే హెచ్చరించారని, కానీ ఈ ప్రభుత్వం ఉన్నా, పడిపోయినా పవార్ పట్ల ఈ విధమైన భాషను ఉపయోగించడం తగదని రౌత్ అన్నారు. ఈ బెదిరింపులకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాల మద్దతు ఉందా అని ప్రశ్నించారు.

కాగా-ఏక్ నాథ్ షిండేతో పాటు 12 మంది రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని సంజ‌య్ రౌత్‌ మీడియాకు తెలిపారు. గౌహతిలో ఉన్న ఎమ్మెల్యేల్లో 22 మందితో తాము టచ్ లో ఉన్నామని ఆయన వెల్లడించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను పవార్ బెదిరిస్తున్నారని, వారికి అసెంబ్లీలో ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని నారాయణ్ రాణే ఇటీవల బెదిరించారని రౌత్ చెప్పారు. ఏక్ నాథ్ షిండేతో గౌహతిలో ఉన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీకి తిరిగి రావాలని పవార్ వ్యాఖ్యానించారని, .ఈ మాత్రానికే పవార్ ని బెదిరిస్తారా ప్ర‌శ్నించారు.

ఇక సంజయ్ రౌత్ కూడా సీఎం ఉద్ధవ్ థాక్రే ఈ ‘యుద్ధం’లో గెలుస్తారని, శివసేన మహాసముద్రం వంటిదని, అలలు వస్తూ, పోతుంటాయని వ్యాఖ్యానించారు. రెబల్ నేత ఏక్ నాథ్ షిండేని, ఆయన వర్గాన్ని సంజయ్ దాదాపు హెచ్చరిస్తూ.. శివసైనికులు ఇంకా రోడ్ల మీదికి వస్తారన్న విషయాన్ని గుర్తించాలని, ఇలాంటి పోరాటాలను తాము చట్టం ద్వారానో లేదా రోడ్లపైనో ఎదుర్కొంటామన్నారు. సమయమే వస్తే సేన కార్యకర్తలు రోడ్లపైకి రావడం ఖాయమని మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు.

బెదిరించామా ..? బీజేపీ ఖండన
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ని కేంద్రమంత్రి నారాయణ్ రాణే బెదిరించినట్టు శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన ఆరోపణను బీజేపీ ఖండించింది. ఏ మంత్రి కూడా ఎవరినీ బెదిరించలేదని, మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు మేమేమీ ప్రయత్నించడం లేదని రైల్వే శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ పాటిల్ దాన్వే అన్నారు. ఇది శివసేన అంతర్గత వ్యవహారమన్నారు.

ఇదిలా ఉండగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెలలో జరగనున్న నేపథ్యంలో బీజేపీ.. వెయిట్ అండ్ వాచ్ అన్న ధోరణిలో పరిణామాలను గమనిస్తోంది. ఇక శివసేనను, ఉద్ధవ్ థాక్రేని శరద్ పవార్ సమర్థిస్తుండడంతో థాక్రేవర్గం నిశ్చింతగా ఉంది. సేన ఎమ్మెల్యేలు ముంబైకి తిరిగి వస్తే పరిస్థితులు అన్నీ చక్కబడతాయని, థాక్రే పట్ల తనకు నమ్మకం ఉందని పవార్ అంటున్నారు.

First Published:  24 Jun 2022 2:03 AM GMT
Next Story