Telugu Global
National

‘వెకేషన్ కి ఉద్ధవ్ థాక్రే కూడా మా రాష్ట్రానికి రావచ్చు.’. అసోం సీఎం హిమంత బిస్వ శర్మ

మహారాష్ట్రలో రాజకీయాలు షిండే ఇచ్చిన షాక్ తో ఓ వైపు అట్టుడుకుతుంటే మరోవైపు అసోం సీఎం హిమంత బిస్వ శర్మకి ఇదంతా తమాషాగా ఉన్నట్టుంది. వెకేషన్ కి మీరు కూడా మా రాష్ట్రానికి రావచ్చునంటూ ఆయన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకి ఆహ్వానం పలుకుతున్నారు. ఈ దేశంలోని ఎమ్మెల్యేలనందరినీ మా రాష్ట్రానికి ఇన్వైట్ చేస్తున్నా.. రెబెల్ ఎమ్మెల్యేలు మరికొన్ని రోజులు అసోంలో ఉండదలిస్తే నాకు సంతోషమే.. ప్రతివారినీ ఆహ్వానిస్తున్నా.. ఇదే క్రమంలో థాక్రేకూడా ఇక్కడికి రావచ్చు అని […]

CM Himanta Biswa Sharma
X

మహారాష్ట్రలో రాజకీయాలు షిండే ఇచ్చిన షాక్ తో ఓ వైపు అట్టుడుకుతుంటే మరోవైపు అసోం సీఎం హిమంత బిస్వ శర్మకి ఇదంతా తమాషాగా ఉన్నట్టుంది. వెకేషన్ కి మీరు కూడా మా రాష్ట్రానికి రావచ్చునంటూ ఆయన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకి ఆహ్వానం పలుకుతున్నారు. ఈ దేశంలోని ఎమ్మెల్యేలనందరినీ మా రాష్ట్రానికి ఇన్వైట్ చేస్తున్నా.. రెబెల్ ఎమ్మెల్యేలు మరికొన్ని రోజులు అసోంలో ఉండదలిస్తే నాకు సంతోషమే.. ప్రతివారినీ ఆహ్వానిస్తున్నా..

ఇదే క్రమంలో థాక్రేకూడా ఇక్కడికి రావచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా మీరు వ్యవహరిస్తున్నందువల్ల ఫెడరల్ వ్యవస్ధను అతిక్రమిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయన్న మీడియా ప్రశ్నకు ఆయన.. ఎమ్మెల్యేలు ఇక్కడికి వస్తున్నప్పుడు నేను హోటళ్లను ఎలా మూసుకుంటానని ప్రశ్నించారు. వ్యక్తులు ఈ రాష్ట్రానికి వస్తున్నప్పుడువారిని ఎలా ఆపుతానని, దేశంలో ఫెడరల్ వ్యవస్థ ఉంది కదా అని ఇక్కడి హోటళ్లకు రావద్దని వారికి ఎలా చెబుతానని ఆయన అన్నారు. ఇక్కడికి ఎవరొచ్చినా తనకు హర్షదాయకమేనని, వారెంతకాలమైనా ఉండవచ్చునని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నో మంచి హోటళ్లు ఉన్నాయని అన్నారు.

రెబెల్ శివసేన నేత.. ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో ఇక్కడి రాడిసన్ బ్లూ హోటల్ కి వచ్చినప్పుడు హిమంత బిస్వ శర్మ కూడా ఈ హోటల్ ని విజిట్ చేశారు.. ఇలా ఆయన మహారాష్ట్ర రాజకీయాల్లో పరోక్షంగా వేలు పెట్టారు. అసోంలో బీజేపీకి చెందిన పలువురు నేతలు సైతం మహారాష్ట్ర రెబెల్ సేన ఎమ్మెల్యేలతో కలిసి ముచ్చటలాడి వెళ్లడం కెమెరాల కంట పడింది.

ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రికి 13 నుంచి 17 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో శివసేన నేతలు పార్టీ జిల్లా శాఖల అధ్యక్షులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే తమకు మద్దతునిస్తున్న వారిని కూడా ఈ సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు. శివసేన భవన్ లో జరిగిన మీటింగ్ కి ఆదిత్య థాక్రే, వినాయక్ రౌత్, సచిన్ అహిర్ వంటి పలువురు సీనియర్ నాయకులు కూడా హాజరయ్యారు. ఉద్ధవ్ థాక్రే వర్చ్యువల్ గా ఈ సమావేశంలో పాల్గొనడం విశేషం.

రెబెల్ సేన ఎమ్మెల్యేలు ముంబైకి వచ్చి తమ సత్తా చూపాలని సేన ఎంపీ సంజయ్ రౌత్ సవాలు విసరగా.. ఎందుకైనా మంచిదని ఏక్ నాథ్ షిండే ముంబైకి తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఆయన మరికొన్ని రోజులు గౌహతిలోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు-రాష్ట్ర అసెంబ్లీలో తమ లెజిస్లేచర్ పార్టీ నాయకునిగా అజయ్ చౌదరి నియమించాలన్న సేన ప్రతిపాదనను డిప్యూటీ స్పీకర్ అంగీకరించారు.

First Published:  24 Jun 2022 11:49 AM IST
Next Story