ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు.. పత్రాలపై ఎంపీ విజయసాయిరెడ్డి సంతకం
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము కాసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. గురువారమే ఢిల్లీకి చేరుకున్న ఆమె శుక్రవారం ఉదయం పార్లమెంటుకు చేరుకున్నారు. అక్కడ మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బిస్రా ముండా విగ్రహాలకు నివాళులు అర్పించారు. కాసేపటి తర్వాత బీజేపీతో పాటు ఆమెకు మద్దతు ఇస్తున్న పార్టీల ఎంపీలు కొంతమంది పార్లమెంటుకు చేరుకున్నారు. ద్రౌపది ముర్ముకు సంబంధించిన నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర.. ప్రధాని మోడీకి […]
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము కాసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. గురువారమే ఢిల్లీకి చేరుకున్న ఆమె శుక్రవారం ఉదయం పార్లమెంటుకు చేరుకున్నారు. అక్కడ మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బిస్రా ముండా విగ్రహాలకు నివాళులు అర్పించారు. కాసేపటి తర్వాత బీజేపీతో పాటు ఆమెకు మద్దతు ఇస్తున్న పార్టీల ఎంపీలు కొంతమంది పార్లమెంటుకు చేరుకున్నారు.
ద్రౌపది ముర్ముకు సంబంధించిన నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర.. ప్రధాని మోడీకి అందజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆమె పేరును ప్రతిపాదిస్తూ సంతకాలు చేయగా.. కేంద్ర మంత్రులు, ఎన్టీయే పార్టీలకు చెందిన ఎంపీలు, మద్దతు ఇస్తున్న పార్టీల ఎంపీలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తూ 50 మంది, బలపరుస్తూ మరో 50 మంది సంతకాలు చేశారు.
వైసీపీ నుంచి ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. వాస్తవానికి వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా.. కేబినెట్ మీటింగ్ ఉండటంతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు.
మరోవైపు ద్రౌపతి ముర్ముకు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వడానికి జార్ఖండ్ ముక్తి మోర్చ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. శనివారం ఉదయం తమ ఎమ్మెల్యేలు, ఎంపీలతో జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ఇక విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈ నెల 27న తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం ఆయనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.