అగ్నిపథ్ పథకం : ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ధ్వజం
ఒకవైపు అగ్నిపథ్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నా మరోవైపు దానిపై నిరసనలు ఆగడం లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో రిక్రూట్‌మెంట్ కోసం అగ్నిపథ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఈ తరుణంలో సొంత పార్టీపైనే భారతీయ జనతాపార్టీ (బీజేపీ) పార్లమెంటు సభ్యుడు వరుణ్ గాంధీ అగ్నిపథ్ పథకంపై మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నిరసన గళం వినిపించాడు. అగ్నివీర్‌కు పింఛను రాకపోతే తాను కూడా పింఛను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని వరుణ్ గాంధీ చెప్పారు. వరుణ్ గాంధీ […]
ఒకవైపు అగ్నిపథ్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నా మరోవైపు దానిపై నిరసనలు ఆగడం లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో రిక్రూట్‌మెంట్ కోసం అగ్నిపథ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఈ తరుణంలో సొంత పార్టీపైనే భారతీయ జనతాపార్టీ (బీజేపీ) పార్లమెంటు సభ్యుడు వరుణ్ గాంధీ అగ్నిపథ్ పథకంపై మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నిరసన గళం వినిపించాడు. అగ్నివీర్‌కు పింఛను రాకపోతే తాను కూడా పింఛను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని వరుణ్ గాంధీ చెప్పారు.
వరుణ్ గాంధీ ట్వీట్ చేస్తూ, “స్వల్పకాలం పనిచేసిన అగ్నివీర్‌కు పెన్షన్‌కు అర్హత లేదు, అప్పుడు ప్రజా ప్రతినిధులకు ఈ ‘సౌకర్యం’ ఎందుకు? దేశాన్ని కంటికి రెప్పలా కాపలా కాచే వారికి పెన్షన్ హక్కు లేకపోతే, నేను కూడా నా స్వంత పెన్షన్ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎమ్మెల్యేలు/ఎంపీలు పెన్షన్ వదులుకుని అగ్నివీరులకు పెన్షన్ అందేలా చూడలేమా?” అంటూ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. అగ్నిపథ్ పథకానికి సంబంధించి వరుణ్ గాంధీ ఇలాంటి ప్రకటన చేయడం ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు సంధించారు.
కొంతకాలం క్రితం వరుణ్ గాంధీ ఇలా అన్నారు, ”యువకుడి కల చెదిరిపోతే, దేశం మొత్తం కల చెదిరిపోయినట్టే. నాలుగు సంవత్సరాల తర్వాత అగ్నివీర్లకు గౌరవప్రదమైన పునరావాసం ఉంటుందా? సమాజంలోని చివరి వ్యక్తి గొంతు కూడా వినిపించాలి తప్ప, వారి గళాలను అణచివేయకూడదని నేను నమ్ముతున్నాను. దేశభక్తి గల యువకుడు భారతమాతకు సేవాభావంతో దధీచిలా అస్థికలను కరిగించి, సైన్యంలో ఉద్యోగం సంపాదించుకుంటాడు. నిరంతరం దేశ సరిహద్దుల్లో ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా, శక్తులనైనా ఎదిరించి ధైర్యంగా పోరాడే దేశరక్షకులకు ఇదేనా మనం ఇచ్చేగౌరవం? కల్పించే ఆదరణ. ప్రజాస్వామ్యంలో శాంతియుత ప్రదర్శన అందరి హక్కు. దేశానికి వెన్నెముక అని చెప్పుకుంటున్న రైతన్నలు కూడా తమ హక్కుల కోసం రోడ్డెక్కడం సిగ్గుచేటు.”అంటూ వరుణ్ గాంధీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
విజయవర్గీయ పై ఆగ్రహం ..
కొద్ది రోజుల క్రితం, నాలుగు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం అగ్నివీర్ పదవీ విరమణ చేసిన తర్వాత సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం ఇప్పిస్తామన్న బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ వ్యాఖ్యలపై వరుణ్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. “సైనికుల వీరోచిత గాథలు ఏ డిక్షనరీ లోనూ కనబడవు. చరిత్రకెక్కని వీరగాధలు ఎన్నో ఉంటాయి. మాటలకందని గొప్పదనం కలది మన సైన్యం. ప్రపంచం మొత్తం ప్రతిధ్వనించే పరాక్రమం ఉన్న గొప్ప సైన్యం. భారత సైన్యం కేవలం ‘ఉద్యోగం’ మాత్రమే కాదు, భారతి తల్లికి సేవా మాధ్యమం. అటువంటి వారికి ‘చౌకీదారీగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉండాలి.”అని అన్నారు వరుణ్ గాంధీ.