Telugu Global
NEWS

శరీర కదలికల నుంచి కరెంట్ ఉత్పత్తి.. సరికొత్త ఆవిష్కరణ

విద్యుత్.. ఇప్పుడు మనకు అత్యంత అవసరమైన సరుకు. ఒకవైపు బొగ్గు నిల్వలు తరిగిపోతుండటంతో సాంప్రదాయ ఇంధన వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి కూడా రాబోయే రోజుల్లో కష్టంగా మారనుంది. అలాంటి సమయంలో సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిపై ప్రపంచ దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తికి ఏ మాత్రం అవకాశం ఉన్నా దాన్ని వదులుకోవడం లేదు. ఈ కోవలోనే ఇటీవల ఒక వినూత్నమైన ఆవిష్కరణ చోటు చేసుకున్నది. మనిషి కదలికల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వస్త్రాన్ని (క్లాత్) […]

శరీర కదలికల నుంచి కరెంట్ ఉత్పత్తి.. సరికొత్త ఆవిష్కరణ
X

విద్యుత్.. ఇప్పుడు మనకు అత్యంత అవసరమైన సరుకు. ఒకవైపు బొగ్గు నిల్వలు తరిగిపోతుండటంతో సాంప్రదాయ ఇంధన వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి కూడా రాబోయే రోజుల్లో కష్టంగా మారనుంది. అలాంటి సమయంలో సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిపై ప్రపంచ దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తికి ఏ మాత్రం అవకాశం ఉన్నా దాన్ని వదులుకోవడం లేదు. ఈ కోవలోనే ఇటీవల ఒక వినూత్నమైన ఆవిష్కరణ చోటు చేసుకున్నది.

మనిషి కదలికల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వస్త్రాన్ని (క్లాత్) సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ వస్త్రం కేవలం స్ట్రెచబుల్ (సాగేగుణం), వాటర్ ప్రూఫ్ మాత్రమే కాకుండా.. శరీర కదలికల ద్వారా విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేస్తుందని వారు చెప్తున్నారు. ఈ వస్త్రంతో చేసిన బట్టలు ధరించడం ద్వారా చిన్న ఎలక్ట్రానిక్ వస్తులు చార్జింగ్ చేసుకునేంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంటున్నారు. డిజిటల్ వాచెస్, ఫిట్‌నెస్ బ్యాండ్స్ ఈజీగా చార్జ్ అవుతాయని వివరించారు.

అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అనే మ్యాగజైన్‌లో ఈ రీసెర్చ్‌కు సంబంధించిన విశేషాలతో ఒక ఆర్టికల్ ప్రచురించారు. 3X4 సెంటీమీటర్ల పరిమాణం ఉన్న ఫ్యాబ్రిక్‌పై కొట్టడం ద్వారా 100 ఎల్‌ఈడీలను వెలిగించగలిగారు. ఈ వస్త్రం వేరే క్లాత్ లేదా చర్మాన్ని తాకినప్పుడు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని సదరు పరిశోధకులు చెప్పారు. ఈ బట్టను ఉతికినా, మడటపెట్టినా, నలిపినా విద్యుత్ ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపించదని చెప్పారు. ఈ వస్త్రం తయారు చేసిన దగ్గర నుంచి 5 నెలల పాటు నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని వారు అంటున్నారు.

డిజిటల్ వాచెస్, ఫిట్‌నెస్ బ్యాండ్ల, ఎల్‌సీడీ స్క్రీన్లు ఈ బట్ట ఉత్పత్తి చేసే విద్యుత్ ద్వారా పని చేయగలవని అన్నారు. ఈ వస్త్రం ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను సూపర్ కెపాసిటర్ల ద్వారా నిల్వ చేసి ఆ తర్వాత కూడా ఉపయోగించవచ్చు అని చెప్పారు. ఒక రోజంతా మనిషి కదలికల ద్వారా విద్యుత్ నిల్వ చేసి.. రాత్రి సమయాల్లో ఉపయోగించుకునే వీలుంటుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ టెక్నాలజీని వీలైనంత త్వరగా మార్కెట్లోకి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నారు.

First Published:  24 Jun 2022 12:12 PM IST
Next Story