కొడుకు తాగుబోతు అయినంత మాత్రాన మద్య నిషేధం విధించలేం …హైకోర్టు
కొడుకు తాగుబోతు అయినంత మాత్రాన మద్యనిషేధంపై ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు ఓ వృద్ద జంటకు తేల్చి చెప్పింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన రామచంద్రగౌడ్ దంపతుల కొడుకు శ్రీధర్ గౌడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి భానిసైన ఆయన భార్యను వదిలేశాడని, వృద్దులమైన తమను కూడా రోజూ వేధిస్తున్నాడని అందువల్ల మద్య నిషేధం విధించాలని హైకోర్టు గడప తొక్కారు రామచంద్రగౌడ్ దంపతులు. ఈ పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు మద్య నిషేధం పై ఉత్తర్వులు ఇవ్వడం కోర్టు […]
కొడుకు తాగుబోతు అయినంత మాత్రాన మద్యనిషేధంపై ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు ఓ వృద్ద జంటకు తేల్చి చెప్పింది.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన రామచంద్రగౌడ్ దంపతుల కొడుకు శ్రీధర్ గౌడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి భానిసైన ఆయన భార్యను వదిలేశాడని, వృద్దులమైన తమను కూడా రోజూ వేధిస్తున్నాడని అందువల్ల మద్య నిషేధం విధించాలని హైకోర్టు గడప తొక్కారు రామచంద్రగౌడ్ దంపతులు.
ఈ పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు మద్య నిషేధం పై ఉత్తర్వులు ఇవ్వడం కోర్టు పరిధిలో లేదని చెప్పింది. దీనిపై చట్టసభలే నిర్ణయం తీసుకోవాలే తప్ప కోర్టులు కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.