Telugu Global
National

పవార్ అంతర్మథనం.. సీఎంకు తెలియకుండా ఎమ్మెల్యేలు ఎగిరిపోయారా..?

మహా సర్కారుపై తిరుగుబాటు సడన్ గా జరిగిందా.. లేక ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా..? ఒకవేళ అంత ప్లానింగ్ తో జరిగితే రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ ఏంచేస్తోంది. మూకుమ్మడిగా శివసేన ఎమ్మెల్యేలంతా గుజరాత్ కి వెళ్తుంటే అసలు ఎవ్వరికీ అనుమానం రాలేదా..? అంతమంది ప్రజా ప్రతినిధులు ఒకేసారి రాష్ట్రం దాటుతుంటే.. కనీసం ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ కి కూడా అనుమానం రాలేదా..? వస్తే సీఎంకు వారు సమాచారం ఇవ్వలేదా..? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం వెదికే […]

Capture
X

మహా సర్కారుపై తిరుగుబాటు సడన్ గా జరిగిందా.. లేక ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా..? ఒకవేళ అంత ప్లానింగ్ తో జరిగితే రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ ఏంచేస్తోంది. మూకుమ్మడిగా శివసేన ఎమ్మెల్యేలంతా గుజరాత్ కి వెళ్తుంటే అసలు ఎవ్వరికీ అనుమానం రాలేదా..? అంతమంది ప్రజా ప్రతినిధులు ఒకేసారి రాష్ట్రం దాటుతుంటే.. కనీసం ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ కి కూడా అనుమానం రాలేదా..? వస్తే సీఎంకు వారు సమాచారం ఇవ్వలేదా..? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం వెదికే పనిలో ఉన్నారు శరద్ పవార్. ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ ఘోరంగా విఫలమైందనే అసంతృప్తిలో ఆయన ఉన్నారట. విచిత్రం ఏంటంటే.. హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ ఎన్సీపీకి చెందిన నాయకుడే. ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ కూడా ఈ వ్యవహారంలో ముందు చూపుతో వ్యవహరించలేకపోయారని శరద్ పవార్ అసహనం వ్యక్తం చేశారట. ఇంకో విచిత్రం ఏంటంటే.. హోం శాఖ సహాయ మంత్రి శంభురాజ్ దేశాయ్ కూడా రెబల్ ఎమ్మెల్యేల శిబిరంలో ఉన్నారు.

ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్..

మహా సంక్షోభాన్ని ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ గా అభివర్ణిస్తున్నారు శరద్ పవార్. ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా గుజరాత్ ఎందుకెళ్తున్నారు, ప్రయాణ ఏర్పాట్లు ఎందుకు చేసుకున్నారనే సమాచారం ముందుగా లీకై ఉంటే.. కచ్చితంగా వారంతా ఒకేచోట చేరకుండా కట్టడిచేసే అవకాశముండేదని శరద్ పవార్ అభిప్రాయ పడుతున్నారు. కానీ ఇప్పుడు చేతులు కాలాయి. ఇక ఆకులు పట్టుకున్నా లాభం లేదు. ఎమ్మెల్యేలంతా ముంబై నుంచి గుజరాత్ వెళ్లిపోయాక ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు జెండా ఎగరేశారు. అక్కడ్నుంచి వారందర్నీ అసోం షిఫ్ట్ చేసి మరో ట్విస్ట్ ఇచ్చారు.

కిం కర్తవ్యం..?

ఇప్పటికే మహా సంక్షోభం ముదిరిపోయింది. ఇప్పుడు చేసేదేం లేదు. దీన్ని కేవలం శివసేన అంతర్గత సంక్షోభంగా అభివర్ణించలేం. మహా వికాస్ అగాఢీ ప్రభుత్వానికే ఇది పెద్ద షాక్. కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. రెండిటికీ ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి చుక్కలు చూపెట్టాలని ప్రతిపక్షాలు ఏర్పాట్లు చేసుకుంటున్న వేళ.. ఇలా ప్రతిపక్షాలనే బీజేపీ ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. విభజించి పాలిస్తోంది.

First Published:  23 Jun 2022 12:06 PM IST
Next Story