అమ్మఒడికి బొత్స మెలిక ఇదే..
అమ్మఒడి పథకాన్ని ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నవరత్నాల్లో ఇది ఎంతో ముఖ్యమైనది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో ఈ పథకం గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ముఖ్యంగా మహిళలు ఈ పథకానికి ఎక్కువగా ఆకర్షితులయ్యారు. అయితే ప్రస్తుతం ఈ పథకంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ చిన్న మెలిక పెట్టారు. ‘అమ్మఒడి పథకం వర్తించాలంటే విద్యార్థుల హాజరు 75 శాతం ఉండాల్సిందే.. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. […]
అమ్మఒడి పథకాన్ని ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నవరత్నాల్లో ఇది ఎంతో ముఖ్యమైనది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో ఈ పథకం గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ముఖ్యంగా మహిళలు ఈ పథకానికి ఎక్కువగా ఆకర్షితులయ్యారు. అయితే ప్రస్తుతం ఈ పథకంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ చిన్న మెలిక పెట్టారు.
‘అమ్మఒడి పథకం వర్తించాలంటే విద్యార్థుల హాజరు 75 శాతం ఉండాల్సిందే.. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. విద్యార్థుల్లో హాజరుశాతం పెంచడం కూడా అమ్మఒడి లక్ష్యాల్లో ఒకటి. ఇక ఈ పథకంలో రూ. 2000 కోత విధిస్తున్న మాట నిజమే. పాఠశాలల మరుగుదొడ్ల నిర్వహణ కోసం ఈ డబ్బును తీసుకుంటున్నాం. అమ్మఒడి పథకానికి లబ్ధిదారులను తగ్గిస్తున్నామని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత తగ్గిన మాట నిజమే.. ఎందుకు తగ్గిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత తగ్గలేదు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలనుకోవడం సరికాదు’ అంటూ బొత్స సత్యనారాయణ మీడియాకు వివరించారు.
అమ్మఒడి పథకానికి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. మరోవైపు విద్యారంగాన్ని మెరుగుపరచాలని జగన్ భావిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ‘నాడు- నేడు’ కింద పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు అమ్మఒడి స్కీమ్ ను కూడా తీసుకొచ్చారు.