Telugu Global
National

అగ్నిపథ్ కు అప్లై చేస్తే సామాజిక బహిష్క‌రణే… హర్యాణా ఖాప్ పంచాయితీ హెచ్చరిక‌

సాయుధ దళాల్లో రిక్రూట్ మెంట్ కోసం కేంద్రం కొత్తగా తీసుకవచ్చిన అగ్నిపథ్ పథకానికి యువకులు ఎవరైనా అప్లై చేసుకుంటే వారిని సామాజికంగా బహిష్కరించాలని హర్యాణా ఖాప్ పంచాయితీ తీర్మానించింది. అంతే కాకుండా ఈ పథకానికి మద్దతు ఇచ్చే బిజెపి-జెజెపి కూటమికి చెందిన రాజకీయ నాయకులు, స్కీమ్‌కు మద్దతిచ్చిన కార్పొరేట్ సంస్థలను కూడా బహిష్కరించాల్సిందిగా పంచాయితీ పిలుపునిచ్చింది. హర్యాణా రాష్ట్రం రోహ్‌తక్ జిల్లాలోని సంప్లా పట్టణంలో బుధవారం కాప్ సమావేశం జరిగింది, ఇందులో హర్యాణా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, […]

haryana khap
X

సాయుధ దళాల్లో రిక్రూట్ మెంట్ కోసం కేంద్రం కొత్తగా తీసుకవచ్చిన అగ్నిపథ్ పథకానికి యువకులు ఎవరైనా అప్లై చేసుకుంటే వారిని సామాజికంగా బహిష్కరించాలని హర్యాణా ఖాప్ పంచాయితీ తీర్మానించింది. అంతే కాకుండా ఈ పథకానికి మద్దతు ఇచ్చే బిజెపి-జెజెపి కూటమికి చెందిన రాజకీయ నాయకులు, స్కీమ్‌కు మద్దతిచ్చిన కార్పొరేట్ సంస్థలను కూడా బహిష్కరించాల్సిందిగా పంచాయితీ పిలుపునిచ్చింది.

హర్యాణా రాష్ట్రం రోహ్‌తక్ జిల్లాలోని సంప్లా పట్టణంలో బుధవారం కాప్ సమావేశం జరిగింది, ఇందులో హర్యాణా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లోని వివిధ ఖాప్ , ఇతర కమ్యూనిటీ గ్రూపుల ప్రతినిధులు, వివిధ విద్యార్థి సంఘాల సభ్యులు కూడా పాల్గొన్నారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన ధంకర్ ఖాప్ అధినేత ఓం ప్రకాష్ ధన్కర్ మాట్లాడుతూ… ”ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిని సామాజికంగా ఒంటరి చేయడానికిప్రయత్నిస్తాము. యువకులను కూలీలుగా మార్చజూస్తున్న‌ ఈ పథకాన్ని మేము బహిష్కరిస్తున్నాము” అని చెప్పారు. దరఖాస్తుదారులందరినీ బహిష్కరిస్తారా అనిప్రశ్నించినప్పుడు, “మేము ‘బహిష్కరణ’ అనే పదాన్ని ఉపయోగించడం లేదు, అయితే అటువంటి వ్యక్తులను సమాజం నుండి దూరం చేస్తాము.” అని అన్నారు.

అగ్నిపథ్ స్కీమ్‌కు మద్దతిచ్చిన కార్పొరేట్ సంస్థలు, రాజకీయ నాయకులను బహిష్కరించాలని అతను పిలుపునిచ్చారు. ఈ కంపెనీల నుండి 10,000 రూపాయల కంటే ఎక్కువగా ఎటువంటి ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని ఆయన‌ ప్రజలను కోరారు.

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వారిపై పెట్టిన‌ కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని ఓం ప్రకాష్ ధన్‌కర్ డిమాండ్ చేశారు.

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సంప్లాలోని ఛోటూ రామ్ ధామ్ వద్ద శాశ్వత నిరసన వేదిక ఏర్పాటు చేశామ‌ని, అక్కడ ప్రజలు అందరూ పాల్గొనాలని ఆయన కోరారు.

First Published:  23 Jun 2022 12:20 PM IST
Next Story