అగ్నిపథ్ నిరసనలు: అరెస్టు భయంతో ఆర్మీ అభ్యర్థి ఆత్మహత్యా యత్నం…పరిస్థితి విషమం
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికిందరాబాద్ స్టేషన్ వద్ద నిరసనల్లో పాల్గొన్న వాళ్ళకు ప్రస్తుతం కేసులు, అరెస్టుల భయం పట్టుకుంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఇప్పటికే చాలా మందిని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోబోమని త్రివిధ దళాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కేసులు, అరెస్టు భయంతో జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్‌కు చెందిన గోవింద్ అజయ్ అనే యువకుడు […]
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికిందరాబాద్ స్టేషన్ వద్ద నిరసనల్లో పాల్గొన్న వాళ్ళకు ప్రస్తుతం కేసులు, అరెస్టుల భయం పట్టుకుంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఇప్పటికే చాలా మందిని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోబోమని త్రివిధ దళాలు ఇప్పటికే ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో కేసులు, అరెస్టు భయంతో జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్‌కు చెందిన గోవింద్ అజయ్ అనే యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
అజయ్ సికిందరాబాద్ స్టేషన్ వద్ద జరిగిన నిరసనల్లో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఓ టీవీ ఛానల్ తో మాట్లాడాడు. దాని ఆధారంగా తనపై కేసులు పెడతారని అజయ్ భయపడ్డాడు. దాంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గుర్తించి అజయ్ ని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.