Telugu Global
National

‘న‌న్ను కిడ్నాప్‌చేశారు..’శివ‌సేన రెబెల్ ఎమ్మెల్యే యూ-ట‌ర్న్‌

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో సంచలనాత్మక ట్విస్ట్ చోటు చేసుకుంది. శివ‌సేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే శిబిరంలో ఉన్న‌ట్టుగా భావించిన శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతుగా నిల‌వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. తనను “కిడ్నాప్” చేసి గుజరాత్‌లోని సూరత్‌కు తీసుకెళ్లారని, అక్కడి నుంచి తాను తప్పించుకున్నాన‌ని పేర్కొన్నాడు. “తెల్లవారుజామున 3 గంటలకు రోడ్డుపై నిలబడిన‌ప్పుడు దాదాపు వంద మందికి పైగా పోలీసులు వచ్చి నన్ను బ‌ల‌వంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. నాకు గుండెపోటు వచ్చినట్లు […]

Sena
X

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో సంచలనాత్మక ట్విస్ట్ చోటు చేసుకుంది. శివ‌సేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే శిబిరంలో ఉన్న‌ట్టుగా భావించిన శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతుగా నిల‌వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించాడు.

తనను “కిడ్నాప్” చేసి గుజరాత్‌లోని సూరత్‌కు తీసుకెళ్లారని, అక్కడి నుంచి తాను తప్పించుకున్నాన‌ని పేర్కొన్నాడు.

“తెల్లవారుజామున 3 గంటలకు రోడ్డుపై నిలబడిన‌ప్పుడు దాదాపు వంద మందికి పైగా పోలీసులు వచ్చి నన్ను బ‌ల‌వంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. నాకు గుండెపోటు వచ్చినట్లు చెబుతూ బ‌ల‌వంతంగా వైద్యం చేయంచేందుకు ప్ర‌య‌త్నించారు. వాస్త‌వానికి నాకు ఎటువంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు లేవు. న‌న్ను బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళారు.” అని అతను చెప్పాడు.ప్ర‌స్తుతం ఎవ‌రి వైపు ఉంటార‌ని ఒక విలేఖరి ప్ర‌శ్నించ‌గా “నేను ఉద్ధవ్ ఠాక్రేతోనే ఉన్నాను” అని ఆయన ప్రకటించారు.

నితిన్ దేశ్‌ముఖ్ మహారాష్ట్రలోని బాలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కాగా, దేశ్‌ముఖ్ భార్య ప్రాంజలి త‌న భ‌ర్త క‌న‌బ‌డ‌డంలేద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. జూన్ 20 రాత్రి 7 గంటలకు తన భర్తతో ఫోన్ కాల్‌లో చివరిసారిగా మాట్లాడానని, ఆ త‌ర్వాత అతని ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో అతనితో కమ్యూనికేట్ చేయలేక‌పోయాన‌ని అకోలా పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దేశ్‌ముఖ్‌కు ప్రాణహాని ఉందని తాను అనుమానిస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం మీద మ‌హారాష్ట్ర రాజ‌కీయ సంక్షోభంలో నాట‌కీయ‌ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి.

అసెంబ్లీ ర‌ద్దు చేసేది లేదు..

ప్ర‌స్తుతం నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం నేప‌ద్యంలో అసెంబ్లీని ర‌ద్దు చేస్తార‌న్న‌వార్త‌ల‌ను కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షుడు నానా ప‌టో్లే కొట్టి పారేశారు. అటువంటి ఆలోచ‌నేదీ లేద‌ని ముఖ్య‌మంత్రి, శివ‌సేన అధినేత ఉద్ధ‌వ్ ఠాక్రే స్ప‌ష్టం చేశార‌ని ప‌టోలే చెప్పారు.

**ఎటువంటి ఇబ్బందులు లేవు, అంతా సవ్యంగా సాగుతుంది. ప్రభుత్వం ఐదేళ్ళ‌పాటూ కొనసాగుతుంద‌ని మహారాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్ చెప్పారు. కేబినెట్ భేటీలో రాజ‌కీయ సంక్షోభం గురించి చ‌ర్చించినా అసెంబ్లీ ర‌ద్దు ఆలోచ‌నేదీ చ‌ర్చించాల్సినవ‌స‌రంలేద‌ని ఆయ‌న అన్నారు.

First Published:  22 Jun 2022 10:51 AM IST
Next Story