Telugu Global
National

ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం, 200 మంది మృతి!

అసలే ఆర్థిక సంక్షోభం, తాలిబన్ ల నిర్బంధ పాలనతో అతలాకుతలమవుతున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రజలపై మరో పిడుగు పడింది. అర్దరాత్రి ఆ దేశంలో సంభవించిన శక్తివంతమైన భూకంప‍ం వల్ల దాదాపు 200 మందికి పైగా ప్రజలు మరణించినట్టు బీబీసీ నివేదించింది. వందల మంది గాయాలపాలయ్యారని తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ ఆగ్నేయ నగరం ఖోస్ట్‌కు 44కిమీ దూరంలో భూకంపం కేంద్రీకృతమైంది.దాదాపు 51 కి.మీ లోతులో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.అర్దరాత్రి భూకంప రావడంతో అనేక మంది నిద్రలోనే మరణించారు. వందలాది ఇళ్ళు […]

ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం, 200 మంది మృతి!
X

అసలే ఆర్థిక సంక్షోభం, తాలిబన్ ల నిర్బంధ పాలనతో అతలాకుతలమవుతున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రజలపై మరో పిడుగు పడింది. అర్దరాత్రి ఆ దేశంలో సంభవించిన శక్తివంతమైన భూకంప‍ం వల్ల దాదాపు 200 మందికి పైగా ప్రజలు మరణించినట్టు బీబీసీ నివేదించింది. వందల మంది గాయాలపాలయ్యారని తెలుస్తోంది.

ఆఫ్ఘనిస్తాన్ ఆగ్నేయ నగరం ఖోస్ట్‌కు 44కిమీ దూరంలో భూకంపం కేంద్రీకృతమైంది.దాదాపు 51 కి.మీ లోతులో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.అర్దరాత్రి భూకంప రావడంతో అనేక మంది నిద్రలోనే మరణించారు. వందలాది ఇళ్ళు నేలమట్టమ‌య్యాయి. ఈ భూకంప ప్రభావం దాదాపు 500 కిలో మీటర్ల మేర ఉన్నదని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌తో పాటు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో కూడా భూకంప ప్రభావం కనపడింది. భారత్ లోని కొన్నిప్రదేశాల్లో కూడా ఈ ప్రభావం ఉన్నట్టు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.

“దురదృష్టవశాత్తూ, గత రాత్రి పాక్టికా ప్రావిన్స్‌లోని నాలుగు జిల్లాల్లో తీవ్రమైన భూకంపం సంభవించింది, దీనివల్ల‌ వందలాది మంది ప్రజ‌లు చనిపోయారు. అనేక వందలమంది గాయడ్డారు. అనేక ఇళ్ళు ధ్వంసం అయ్యాయి” అని ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి బిలాల్ కరీమి ట్వీట్ చేశారు.

“ఈ విపత్తునుండి ప్రజలను కాపాడడానికి వెంటనే ఆ ప్రాంతానికి సహాయక బృందాలను పంపాలని మేము అన్ని సహాయ సంస్థలను కోరుతున్నాము.” అని బిలాల్ కరీమి విజ్ఞ‌ప్తి చేశారు

First Published:  22 Jun 2022 6:16 AM IST
Next Story