Telugu Global
National

అగ్నిపథ్ ఆందోళ‌న‌కారుల‌పై జిహాదీ, టెర్ర‌రిస్టులు అంటూ బీజేపీ నేత‌ల వ్యాఖ్య‌లు

అగ్నిప‌థ్ ప‌థ‌కంపై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు జ‌రుగుతున్న నేప‌ధ్యంలో బీజేపీ నేత‌లు ఆందోళ‌న‌కారుల‌పై తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేస్తున్నారు. బీహార్‌ బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఈ ప‌థ‌కాన్ని వ్య‌తిరేకిస్తున్న వారంతా జ‌హాదీలు. వారెన్న‌టికీ దేశ భ‌క్తులు కాలేర‌ని నిరసనకారులను ఉద్దేసించి వ్యాఖ్యానించారు. ఈ ప‌థ‌కంపై దేశ్య వ్యాప్త ఆందోళ‌న‌ల్లో భాగంగా బీహార్‌ లోకూడా తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదే సంద‌ర్భంలో రాజ‌కీయ నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని […]

Union-Minister-Giriraj-Singh-MLA-Haribhushan-Thakur
X

అగ్నిప‌థ్ ప‌థ‌కంపై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు జ‌రుగుతున్న నేప‌ధ్యంలో బీజేపీ నేత‌లు ఆందోళ‌న‌కారుల‌పై తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేస్తున్నారు. బీహార్‌ బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఈ ప‌థ‌కాన్ని వ్య‌తిరేకిస్తున్న వారంతా జ‌హాదీలు. వారెన్న‌టికీ దేశ భ‌క్తులు కాలేర‌ని నిరసనకారులను ఉద్దేసించి వ్యాఖ్యానించారు. ఈ ప‌థ‌కంపై దేశ్య వ్యాప్త ఆందోళ‌న‌ల్లో భాగంగా బీహార్‌ లోకూడా తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదే సంద‌ర్భంలో రాజ‌కీయ నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని నిర‌సిస్తున్న‌వారిని టెర్ర‌రిస్టులుగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అభివ‌ర్ణిస్తే బీజేపీ ఎమ్మెల్యే హ‌రిభూష‌ణ్ ఠాకూర్ వారిని జిహాదీలు అంటూ సంబోధించారు.

ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ బచౌల్ మాట్లాడుతూ సైన్యంలో ఉద్యోగం చేయడం సౌకర్యం కోసం కాదని.. సైన్యంలోని యువత దేశభక్తితో ముందుకు సాగాలన్నారు. దేశం కోసం చనిపోవాలనుకునే యువత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. దేశానికి సేవ చేయాలనే తపన ఉన్న యువత ఈ పథకం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆర్మీ జాబ్ కాదని, సర్వీస్ అని బచాల్ చెప్పాడు. ధైర్యం ఉన్నవాళ్లే చేరతారు అని వ్యాఖ్యానించారు.

యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు..

సైన్యంలో చేరడం తప్పనిసరి అయిన అనేక దేశాలు ప్రపంచంలో ఉన్నాయని అన్నారు. ఇక్కడి ప్రజలు ఐటీఐ, ఇంజ‌నీరింగ్ చ‌దువుకుంటున్నారు. వారికి శిక్ష‌ణ ఇస్తాం. ఉద్యోగాలు క‌ల్పిస్తాం అన్నారు. దీనితో పాటు ఇతర ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ కల్పిస్తాం. ఇలాంటి వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తడం మంచిది కాదని బీజేపీ ఎమ్మెల్యే అన్నారు. ప్రదర్శన పేరుతో రైళ్లు తగలబెడుతున్నారని అన్నారు. బీజేపీ నేతల ఇళ్లపైకి సిలిండర్లు విసురుతున్నారని, వారిని తప్పుదోవ ప‌ట్టించడం వ‌ల్లే వారు ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌న్నారు.

మరోవైపు కేంద్రమంత్రి, బెగుసరాయ్ ఎంపీ గిరిరాజ్ సింగ్ ఉత్తరాఖండ్‌లో మాట్లాడుతూ నిరసనకారులపై తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు ‘బీహార్‌లో ఉగ్రవాదుల్లా చాలా చేశారు’ అని అన్నారు. రాజకీయ పార్టీలు యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాయని, ఇదో చిల్లర రాజకీయమన్నారు. ఈ పథకంలో ఒక‌రికి బదులు ముగ్గురికి ఉపాధి లభిస్తుందని, నాలుగు సంవత్సరాల శిక్షణతో యువత ఉపాధికి సిద్ధంగా ఉంటారన్నారు. దేశంలో నెగిటివ్ రాజకీయాలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నార‌ని మండి ప‌డ్డారు.

First Published:  21 Jun 2022 5:47 AM IST
Next Story