సమ్మెకు నడుం బిగించిన సినీ కార్మికులు-రేపటి నుంచి షూటింగులు బంద్
టాలీవుడ్ లో కార్మికులు సమ్మెకు నడుం బిగించారు రేపటి నుంచి(22జూన్) షూటింగులు బంద్ చేయనున్నారు. కరోనా కారణంగా ప్రతి వస్తువు రేటు పెరిగింది. కానీ సగటు మనిషి జీవన ప్రమాణం మాత్రం పెరగలేదు. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొంత కాలంగా సినీ కార్మికులు కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కనీస వేతనం అమలు చేయాలని వారు కొంతకాలంగా నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారు. సినిమా బడ్జెట్లు పెరిగినా, నటులకు రెమ్యూనరేషన్లు పెరిగినా తమకు మాత్రం […]
టాలీవుడ్ లో కార్మికులు సమ్మెకు నడుం బిగించారు రేపటి నుంచి(22జూన్) షూటింగులు బంద్ చేయనున్నారు.
కరోనా కారణంగా ప్రతి వస్తువు రేటు పెరిగింది. కానీ సగటు మనిషి జీవన ప్రమాణం మాత్రం పెరగలేదు. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొంత కాలంగా సినీ కార్మికులు కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
కనీస వేతనం అమలు చేయాలని వారు కొంతకాలంగా నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారు. సినిమా బడ్జెట్లు పెరిగినా, నటులకు రెమ్యూనరేషన్లు పెరిగినా తమకు మాత్రం వేతనాలు పెరగకపోవడంతో సినీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. సినీ కార్మికుల వేతన సవరణను తెలుగు సినీ పరిశ్రమ విస్మరిస్తోందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
మంగళవారం నాడు వెంకటగిరిలోని ఫిలిం ఫెడరేషన్ కార్యాలయంలో సినీ కార్మిక సంఘాలతో ఫిలిం ఫెడరేషన్ చర్చలు జరిపింది. అనంతరం ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ.. ”వేతనాల పెంపుపై నిర్మాతల మండలి స్పందించడం లేదు. 24 విభాగాల్లోని ఒక్కో కార్మిక సంఘం నాయకులతో చర్చిస్తున్నాం. ప్రతీ మూడేళ్లకోసారి సినీ కార్మికుల వేతనాలు పెరగాలి. కానీ నాలుగేళ్లైనా సినీ కార్మికుల వేతనాలు పెంచలేదు. కార్మిక సంఘాలు ఫిల్మ్ ఫెడరేషన్‌పై ఒత్తిడి తెస్తున్నాయి” అని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో నిర్మాతల మండలి తమతో కనీస వేతన సవరణ ఒప్పందం వెంటనే చేసుకోవాలనే డిమాండ్ తో జూన్ 22 నుంచి సినీ కార్మికులు సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. బుధవారం నుంచి షూటింగులను బహిష్కరించాలని ఫెడరేషన్ పిలుపునిచ్చింది.