Telugu Global
National

రాష్ట్రపతి ఎన్నికలు: కేసీఆర్ లేకుండా విపక్షాల సమావేశాలపై పవార్ గుస్సా

రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరికి వచ్చేస్తున్నాయి కానీ ప్రతిపక్షాలకు ఇప్పటి వరకు అభ్యర్థి దొరకలేదు. ముందుగా నేషనలిస్ట్ కాంగ్రెస్ అధినేత శర‌ద్ పవార్ ను అభ్యర్థిగా అనుకున్నారు. ఆయన తిరస్కరించడంతో గోపాల కృష్ణ గాంధీని అడిగారు ఆయనా తిరస్కరించారు. కశ్మీర్ నాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా కూడా రాష్ట్రపతి రేసులో ఉండడానికి ఆసక్తి చూపలేదు. మొన్న ఇదే అంశంపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఏమీ తేలలేదు. ఇవ్వాళ్ళ శరద్ పవార్ మరో […]

KCR,pawar
X

రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరికి వచ్చేస్తున్నాయి కానీ ప్రతిపక్షాలకు ఇప్పటి వరకు అభ్యర్థి దొరకలేదు. ముందుగా నేషనలిస్ట్ కాంగ్రెస్ అధినేత శర‌ద్ పవార్ ను అభ్యర్థిగా అనుకున్నారు. ఆయన తిరస్కరించడంతో గోపాల కృష్ణ గాంధీని అడిగారు ఆయనా తిరస్కరించారు. కశ్మీర్ నాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా కూడా రాష్ట్రపతి రేసులో ఉండడానికి ఆసక్తి చూపలేదు.

మొన్న ఇదే అంశంపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఏమీ తేలలేదు. ఇవ్వాళ్ళ శరద్ పవార్ మరో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అయితే పవార్ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎందుకు తిరస్కరించారనే విషయంపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. నిజానికి అసలైన కారణాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పార‌ట. వాళ్ళు చెబుతున్న ప్రకారం పవార్ నిలబడక పోవడానికి ముఖ్య కారణం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే.

రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించడానికి విపక్షాలు చేస్తున్న ప్రయత్నాల్లో కేసీఆర్ ను కలుపుకరాకపోవడం పట్ల పవార్ అసంతృప్తిగా ఉన్నారట. కేసీఆర్ లేకుండా విపక్షాల అభ్యర్థిని నిలబెట్టడం అసాధ్యమని పవార్ అభిప్రాయపడుతున్నారు. తనను అభ్యర్థిగా ప్రకటించిన బృందంలో కేసీఆర్ లేకపోవడంతో పవార్ రాష్ట్రపతి అభ్యర్త్విత్వాన్ని తిరస్కరించినట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్టీ లు కేసీఆర్ ను కలుపుకరావడంపై విముఖత చూపించడం పట్ల కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి పోటీగా విపక్షాలు అభ్యర్థిని నిలబెట్టాలంటే బీజేపీ పై తీవ్ర పోరాటం చేస్తున్న కేసీఆర్ లేకుండా ఎలా సాద్యం అన్నది ఆయన ప్రశ్న.

తాను అభ్యర్థి అని ముందుగానే ప్రచారం చేయడాన్ని కూడా పవార్ తప్పుబట్టారు. దానివల్ల తీవ్ర నష్టం జరిగిందని ఆయన అభిప్రాయ‍ం.

మరో వైపు రాష్ట్రపతి అభ్యర్థి అంశంపై ఈ రోజు శరద్ పవార్ ఏర్పాటు చేస్తున్న సమావేశానికి కేసీఆర్ ను, అసదుద్దీన్ ఓ వైసీని పిలవాలని శరద్ పవార్ భావించారు. అయితే కేసీఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మొండిపట్టు పట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ లేకుండానే ఈ రోజు సమావేశం జరగబోతోంది. ఎమ్ ఐ ఎమ్ తరపున ఆ పార్టీ ప్రతినిధి ఆ సమావేశానికి హాజరుకానున్నారు.

కాగా ఈ రోజు తాను ఏర్పాటు చేసిన సమావేశానికి మమతా బెనర్జీ రాకపోవడం పట్ల కూడా పవార్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ రోజు సమావేశానికి సమయాన్ని, వేదికను సూచించిన మమత సమావేశానికి డుమ్మాకొట్టడం పవార్ కు ఆగ్రహం తెప్పించింది.

ఇక విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఈ రోజు మరో కొత్త పేరు తెరమీదికి వచ్చింది. బీజేపీ మాజీ నేత, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలని మమ్తా బెనర్జీ భావిస్తోందని తెలుస్తోంది.

First Published:  21 Jun 2022 5:27 AM IST
Next Story