విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా
రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ వేసే గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అటు బీజేపీ, ఇటు విపక్షాలు తమ అభ్యర్థులను నిర్ణయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. విపక్షాలు పలు సమావేశాల అనంతరం ఇవ్వాళ్ళ తమ రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి, ఈ రోజే తృణముల్ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన యశ్వంత్ సిన్హాను నిర్ణయించారు . ఇవ్వాళ్ళ శరద్ పవార్ ఆద్వర్యంలో ఢిల్లీలోని పార్లమెంటు హౌస్ ఎనెక్స్ లో విపక్ష పార్టీల నాయకులు సమావేశమయ్యారు. కాంగ్రెస్ […]
రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ వేసే గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అటు బీజేపీ, ఇటు విపక్షాలు తమ అభ్యర్థులను నిర్ణయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. విపక్షాలు పలు సమావేశాల అనంతరం ఇవ్వాళ్ళ తమ రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి, ఈ రోజే తృణముల్ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన యశ్వంత్ సిన్హాను నిర్ణయించారు .
ఇవ్వాళ్ళ శరద్ పవార్ ఆద్వర్యంలో ఢిల్లీలోని పార్లమెంటు హౌస్ ఎనెక్స్ లో విపక్ష పార్టీల నాయకులు సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, జైరాం రమేష్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఎన్ సీ పీ నేత ప్రఫుల్ పటేల్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వం పై ఏకాభిప్రాయం వ్యక్తమయ్యింది.
ఈ సమావేశంలో పాల్గొన్న 18 పార్టీల నాయకులు యశ్వంత్ సిన్హా పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించాయి.
విపక్షాల నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు.
ఆదివారం నాడే మమతా బెనర్జీ యశ్వంత్ సిన్హా పేరును విపక్షాలకు సూచించినట్టు తెలుస్తోంది. అయితే ముందుగా సిన్హా తృణమూల్ కాంగ్రెస్ కు రాజీనామా చేయాలని కాంగ్రెస్, వామపక్షాలు నిన్న మమతా బెనర్జీకి చెప్పినట్టు సమాచారం. ఆ నేపథ్యంలో ఇవ్వాళ్ళ ఉదయం యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.ఈ సందర్భంగా సిన్హా ఓ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ లో చేసిన వ్యాఖ్యలతోనే తనను రాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించారన్నది అర్దమైంది.
“TMCలో మమతాజీ నాకు అందించిన గొప్ప గౌరవానికి నేను ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఒక పెద్ద జాతీయ ప్రయోజనం కోసం నేను పార్టీ నుండి వైదొలగాల్సిన సమయం ఆసన్నమైంది. విపక్షాల ఐక్యత కోసం పని చేయడానికి నేను ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాను.” అని ఆయన ట్వీట్ చేశారు.
ఆయన ట్వీట్ చేయడంతోనే యశ్వంత్ సిన్హానే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి అని సోషల్ మీడియాలో నెటిజనులు కామెంట్లు చేయడం మొదలు పెట్టారు.