Telugu Global
National

మోదీ, అదానీల అవినీతి బంధాన్ని కప్పి పెట్టేందుకే అగ్నిపథ్ పథకం -కేటీఆర్ ఆరోపణ‌

వివాదాస్పదంగా మారిన అగ్నిపథ్ పథకంపై తెల‍ంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్  మండిపడ్డారు. శ్రీలంకలో ప్రధాని మోదీ, ప్రముఖ వ్యాపారవేత్త అదానీ అవినీతి బంధంపై వచ్చిన ఆరోపణలనుండి ప్రజలను పక్కదారి పట్టించేందుకే ఈ వివాదాస్పద పథకం తీసుకవచ్చారని ఆయన ఆరోపించారు. శ్రీలంకలో ఓ విధ్యుత్తు ప్రాజెక్టును అదానీకి కట్టబెట్టేందుకు ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్సపై ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. స్వయంగా సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ఛైర్మన్ […]

కేటీఆర్ ఆరోపణ‌
X

వివాదాస్పదంగా మారిన అగ్నిపథ్ పథకంపై తెల‍ంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. శ్రీలంకలో ప్రధాని మోదీ, ప్రముఖ వ్యాపారవేత్త అదానీ అవినీతి బంధంపై వచ్చిన ఆరోపణలనుండి ప్రజలను పక్కదారి పట్టించేందుకే ఈ వివాదాస్పద పథకం తీసుకవచ్చారని ఆయన ఆరోపించారు.

శ్రీలంకలో ఓ విధ్యుత్తు ప్రాజెక్టును అదానీకి కట్టబెట్టేందుకు ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్సపై ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. స్వయంగా సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ఛైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండో ఈ విషయాలను బహిర్గతం చేశారు. ఆ తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఫెర్డినాండో ఆరోపణలపై మోదీ జవాబు ఇవ్వాలంటూ మన దేశ విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై శ్రీలంకలో కూడా ఈ రోజుకీ ప్రజలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అదానీ గోబ్యాక్ అంటూ అక్కడి ప్రజలు నినదిస్తున్నారు.

May be a Twitter screenshot of text that says

ఈ విషయంపై కేటీఆర్ గతంలో కూడా మోదీ పై విమర్శ‌లు గుప్పించారు. అదానీ, మోదీ బంధంపై ఆయన జవాబు ఇచ్చి తీరాల్సిందే అని కేటీఆర్ డిమాండ్ చేశారు కూడా. ఈ నేపథ్యంలో వచ్చిన అగ్నిపథ్ పథకం పై కేటీఆర్ ట్వీట్ చేశారు.

First Published:  20 Jun 2022 6:48 AM IST
Next Story