Telugu Global
National

ముస్లిం బాలికలు 16 ఏళ్ల వ‌య‌సులో పెళ్లాడొచ్చు.. పంజాబ్ హర్యానా హైకోర్టు

ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్ల వ‌య‌సులో పెళ్లి చేసుకోవచ్చని పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది. ఓ మైనర్ వివాహం సక్రమమేనని ఈ కోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఓకే చేసింది. 16 ఏళ్ల ఓ బాలిక 21 ఏళ్ల అబ్బాయిని పెళ్లి చేసుకోగా.. యధాప్రకారం వీరి కుటుంబాల పెద్దలు ఈ వివాహాన్ని అంగీకరించలేదు. వీరి కుటుంబాలనుంచి వీరిద్దరికి రక్షణ కల్పిస్తున్నట్టు ప్రకటించిన కోర్టు.. 16 సంవత్సరాలు వచ్చిన ముస్లిం అమ్మాయి తనకు నచ్చిన యువకుడిని వివాహం చేసుకోవచ్చని స్పష్టం […]

ముస్లిం బాలికలు 16 ఏళ్ల వ‌య‌సులో పెళ్లాడొచ్చు.. పంజాబ్ హర్యానా హైకోర్టు
X

ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్ల వ‌య‌సులో పెళ్లి చేసుకోవచ్చని పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది. ఓ మైనర్ వివాహం సక్రమమేనని ఈ కోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఓకే చేసింది. 16 ఏళ్ల ఓ బాలిక 21 ఏళ్ల అబ్బాయిని పెళ్లి చేసుకోగా.. యధాప్రకారం వీరి కుటుంబాల పెద్దలు ఈ వివాహాన్ని అంగీకరించలేదు. వీరి కుటుంబాలనుంచి వీరిద్దరికి రక్షణ కల్పిస్తున్నట్టు ప్రకటించిన కోర్టు.. 16 సంవత్సరాలు వచ్చిన ముస్లిం అమ్మాయి తనకు నచ్చిన యువకుడిని వివాహం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. జస్టిస్ జస్జీత్ సింగ్ బేడీ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ ఈ సంచలన ఉత్తర్వులివ్వడం విశేషం.

తమకు తమ కుటుంబాల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పఠాన్ కోట్ కి చెందిన జంట కోర్టును ఆశ్రయించింది. వీరి ఫ్యామిలీల అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారన్న కారణంగా వీరికి గల ప్రాథమిక హక్కులను తోసిపుచ్చలేమని న్యాయమూర్తి అన్నారు. భారత రాజ్యాంగంలోని హక్కుల గురించి ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. పైగా ఇస్లామిక్ షరియత్ రూల్ ని కూడా ఆయన గుర్తు చేస్తూ.. ముస్లిం బాలికల పెళ్లిని ముస్లిం పర్సనల్ లా అనుమతిస్తోందని అభిప్రాయపడ్డారు.

సర్ దిన్షా ఫర్డుంజీ ముల్లా అనే వ్యక్తి ‘ప్రిన్సిపల్స్ ఆఫ్ మహమ్మదన్ లా’ అన్న పుస్తకాన్ని రాశారని, ఇందులోని 195 ఆర్టికల్ ప్రకారం.. 16 ఏళ్లు వచ్చిన ముస్లిం బాలికకు తనకు నచ్చిన యువకుడిని పెళ్లాడే అర్హత ఉందన్నారు, ఇక ఈ ఉదంతంలో ఈమెకు నచ్చి వివాహమాడిన యువకుడి వయస్సు 21 ఏళ్లని, అంటే ముస్లిం పర్సనల్ లా కింద వీరిద్దరిదీ పెళ్లి వయస్సేనని కోర్టు వివరించింది. ఈ పిటిషినర్ల అభ్యర్థనను మన్నించాలని భావిస్తున్నామని, చట్టం ప్రకారం ఈ జంటకు తగిన రక్షణ కల్పించాలని పఠాన్ కోట్ పోలీసు అధికారులను ఆదేశిస్తున్నామని కోర్టు పేర్కొంది.

ఇక ముస్లిం ఆచారాల ప్రకారం తమ వివాహం ఈనెల 8న జరిగిందని, కానీ తమ కుటుంబాలు తమ వివాహాన్ని వ్యతిరేకిస్తున్నాయని, పైగా తమ అనుమతి లేనిదే మ్యారేజ్ చేసుకున్నారంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారని ఈ జంట కోర్టులో మొర పెట్టుకుంది. మాకు మీరు రక్షణ కల్పించాలని కోరింది. ముస్లిం లా ప్రకారం ‘ప్యూబర్టీ’ , ‘మెజారిటీ’ అన్నవి ఒకటేనని, 15 ఏళ్ల వయస్సు వచ్చిన వ్యక్తికి కూడా వివాహం చేసుకునే హక్కు ఉంటుందని ఈ కపుల్ వివరించింది. దేశంలో అనేక చోట్ల బాల్య వివాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ముస్లిం జంట విషయంలో పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశమే !

First Published:  20 Jun 2022 6:41 AM IST
Next Story