మోడీజీ ! మీ ఫ్రెండ్ అడ్రస్ చెప్పండి..
ప్రధాని మోడీ తన చిన్ననాటి స్నేహితుడు అబ్బాస్ చిరునామా ఏదో తెలియజేయాలని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. అసలు మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవా, కావా అన్న విషయాన్ని ఆయన్నే అడుగుతానన్నారు. ముసుగులో గుద్దులాట ఎందుకు.. నేరుగా మీ స్నేహితుడు అబ్బాస్ నే దీని గురించి అడిగి తేల్చుకుంటానన్నారు. నూపుర్ వ్యాఖ్యలపై తన నిరసనను, ఆగ్రహాన్ని వదలని ఒవైసీ.. ఏదో ఒకరకంగా మోడీని ఉద్దేశించి […]
ప్రధాని మోడీ తన చిన్ననాటి స్నేహితుడు అబ్బాస్ చిరునామా ఏదో తెలియజేయాలని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. అసలు మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవా, కావా అన్న విషయాన్ని ఆయన్నే అడుగుతానన్నారు. ముసుగులో గుద్దులాట ఎందుకు.. నేరుగా మీ స్నేహితుడు అబ్బాస్ నే దీని గురించి అడిగి తేల్చుకుంటానన్నారు.
నూపుర్ వ్యాఖ్యలపై తన నిరసనను, ఆగ్రహాన్ని వదలని ఒవైసీ.. ఏదో ఒకరకంగా మోడీని ఉద్దేశించి ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. తన తల్లి హీరాబెన్ మోడీ 100 వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మోడీ నిన్న గుజరాత్ చేరుకొని ఆమె ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా తన ఫ్రెండ్ అబ్బాస్ తో తనకున్న బాల్యస్నేహన్ని కూడా ఆయన బ్లాగ్ పోస్ట్ లో పేర్కొన్నారు. తన తండ్రికి సన్నిహితుడైన స్నేహితుడొకడు దగ్గరలోని గ్రామంలో ఉండేవారని, ఆయన అకాల మరణం చెందడంతో తన తండ్రి ఆయన కొడుకు అబ్బాస్ ని తమ ఇంటికి తీసుకువచ్చారని ఆయన తెలిపారు.
అబ్బాస్ తమతోనే ఉండి స్టడీస్ కూడా పూర్తి చేశాడని, అతడంటే తమ తల్లికి ఎంతో అభిమానమని మోడీ గుర్తుచేశారు. ఆమె తమను ఆదరించినట్టే అబ్బాస్ ని కూడా ఆదరిస్తూ అతని బాగోగులు చూసుకునేవారని పేర్కొన్నారు. ప్రతి ఏడాదీ ఈద్ (ముస్లింల పండుగ) వస్తే ఆమె అబ్బాస్ కి ఇష్టమైన డిషెస్ చేసేవారని మోడీ వెల్లడించారు. మోడీపై ఎప్పుడెప్పుడు విరుచుకపడాలా అని ఎదురు చూస్తున్న ఒవైసీకి మంచి ఛాన్స్ దొరికినట్లయింది.
ఎనిమిదేళ్ల తరువాత ఈ ప్రధాని తన స్నేహితుడిని గుర్తుకు తెచ్చుకున్నారని, ఈ ఫ్రెండ్ ఎవరో తమకు తెలియదని అన్నారు. ఇక ఇప్పుడు ఆ అబ్బాస్ ని కాల్ చేయండి.. అతడు అక్కడే ఉంటే నా స్పీచ్ తో బాటు ఉలేమాల (మత గురువుల) ప్రసంగాలను కూడా ఆలకించమనండి .. మేం అబద్దాలు చెబుతున్నామా అన్న విషయాన్నీ అడగండి అని ఒవైసీ పేర్కొన్నారు. దయచేసి ఆ అబ్బాస్ అడ్రస్ షేర్ చేయాలనీ, ప్రవక్త గురించి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవా, కావా అన్నది ఆయన్నే అడుగుతానని అన్నారు.
నూపుర్ చెత్త మాట్లాడిందన్న మా వాదనతో ఆయన (అబ్బాస్) అంగీకరిస్తారని ఒవైసీ పేర్కొన్నారు. మీరు మీ స్నేహితుడిని గుర్తుకు తెచ్చుకున్నారు.. బహుశా ఇది ఓ స్టోరీ అయి ఉండవచ్చు.. మాకెలా తెలుసు ? ‘అచ్చే దిన్’ వస్తాయని మీరు ప్రామిస్ చేశారు.. అవి వచ్చినట్టే అని కూడా మోడీని ఉద్దేశించి సెటైర్ వేశారాయన..