Telugu Global
NEWS

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతున్నారా? ఇలా చేయండి

ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు వాడని వాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. ఒకసారి క్రెడిట్ కార్డుకి అలవాటైపోయాక దాన్నుంచి బయటపడడం చాలాకష్టం. అయితే చాలాసమయాల్లో క్రెడిట్ కార్డు కట్టలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు భరోసాగా ఉంటుందనే ఆలోచనతో చాలామంది క్రెడిట్ కార్డు తీసుకుంటుంటారు. కానీ రానురాను క్రెడిట్ కార్డు ఒక అలవాటుగా మారుతుంది. అవసరంలేని ఖర్చులకు కూడా క్రెడిట్ కార్డును ఉపయోగిస్తూ.. లేనిపోని ఆర్థిక భారాన్ని […]

credit-card
X

ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు వాడని వాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. ఒకసారి క్రెడిట్ కార్డుకి అలవాటైపోయాక దాన్నుంచి బయటపడడం చాలాకష్టం. అయితే చాలాసమయాల్లో క్రెడిట్ కార్డు కట్టలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు భరోసాగా ఉంటుందనే ఆలోచనతో చాలామంది క్రెడిట్ కార్డు తీసుకుంటుంటారు. కానీ రానురాను క్రెడిట్ కార్డు ఒక అలవాటుగా మారుతుంది. అవసరంలేని ఖర్చులకు కూడా క్రెడిట్ కార్డును ఉపయోగిస్తూ.. లేనిపోని ఆర్థిక భారాన్ని పెంచుకుంటారు చాలామంది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేని పరిస్థితుల్లో ఏం చేయాలంటే.

ఒక క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేనప్పుడు మరొక క్రెడిట్ కార్డు నుంచి తీసుకుని రీపేమెంట్ చేస్తుంటారు చాలామంది. దీని వల్ల క్రెడిట్ సైకిల్ పెరుగుతూ పోతుందే తప్ప అప్పు తీరదు. అందుకే బిల్లు కట్టలేనప్పుడు నెలలో మిగతా ఖర్చులకోసం కేటాయించిన మొత్తం లేదా ఇన్వెస్ట్‌మెంట్స్, సేవింగ్స్ లాంటి వాటి నుంచి తీసి బిల్లు కట్టేయాలి.

క్రెడిట్ బిల్లు కట్టలేనప్పుడు మినిమమ్‌ డ్యూ కట్టి ఊరుకోకుండా.. ఎంత వీలైతే అంత ఎక్కువ మొత్తం చెల్లించాలి. దీని ద్వారా డ్యూ డబ్బులపై పడే వడ్డీ భారం తగ్గుతుంది.

క్రెడిట్ కార్డు ఎంచుకునేటప్పుడే బిల్లుని ఈఎంఐలుగా మార్చుకునేందుకు వీలుండే కార్డులను ఎంచుకోవాలి. దీనివల్ల ఎప్పుడైనా బిల్లు చెల్లించలేకపోయినప్పుడు దాన్ని 3 నుంచి 24 నెలలపాటు ఈఎంఐ రూపంలో కన్వర్ట్ చేయొచ్చు.
ఇకపోతే కొద్దిమొత్తంలో ఉండే క్రెడిట్ కార్డు బిల్లు కూడా కట్టలేకపోయినప్పుడు స్నేహితులు, దగ్గరి బంధువుల నుంచి చేబదులుగా డబ్బు తీసుకుని కట్టడం మరొక ఆప్షన్. అప్పు తీసుకోవడంతో పోలిస్తే ఇది కాస్త బెటర్ ఆప్షన్.క్రెడిట్ కార్డు బిల్లు లక్షల్లో ఉండి, కట్టేందుకు డబ్బు లేనప్పుడు బ్యాంకు నుంచి పర్సనల్ లోన్ తీసుకుని కట్టేయడం మేలు. క్రెడిట్ కార్డు బిల్లుపై పడే వడ్డీ కంటే వ్యక్తిగత రుణంపై పడే వడ్డీ తక్కువగా ఉంటుంది.

ఇక చివరిగా క్రెడిట్ కార్డు వల్ల ప్రతినెల ఇబ్బందిపడాల్సి వస్తుందని గ్రహించినప్పుడు వీలైనంత త్వరగా కార్డు బిల్లుని చెల్లించి దాన్ని డీయాక్టివేట్ చేయడం మేలు. అలాగే మరీ ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడకుండా అవసరానికి తగినట్టుగా రెండు, మూడు కార్డులు మాత్రమే వాడడం వల్ల భారం తగ్గుతుంది.

First Published:  20 Jun 2022 12:39 PM IST
Next Story