Telugu Global
National

అగ్నిపథ్:నేడు భారత్ బంద్, భారీగా మోహరించిన పోలీసులు

కేంద్రం ప్రవేశపెట్టిన‌ ‘అగ్నిపథ్‘ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో ఆర్మీ అభ్యర్థులు ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు దేశవ్యాప్త బంద్ జరగనుంది. దాంతో దేశవ్యాప్తంగా పోలీసు బలగాలు అప్రమతమయ్యాయి. పలు సంస్థలు ఈ రోజు (జూన్ 20, 2022) భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన దృష్ట్యా, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఝార్ఖండ్‌, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున […]

bharat bandh
X

కేంద్రం ప్రవేశపెట్టిన‌ ‘అగ్నిపథ్‘ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో ఆర్మీ అభ్యర్థులు ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు దేశవ్యాప్త బంద్ జరగనుంది. దాంతో దేశవ్యాప్తంగా పోలీసు బలగాలు అప్రమతమయ్యాయి.

పలు సంస్థలు ఈ రోజు (జూన్ 20, 2022) భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన దృష్ట్యా, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఝార్ఖండ్‌, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించాయి. భారత్ బంద్ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడవద్దని ప్రజలను హెచ్చరించారు.

తెలంగాణలొ మొన్న సికిందరాబాద్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన హింస నేపథ్యంలో ప్ర‌భుత్వం అన్ని చర్యలను చేపట్టింది. అన్ని రైల్వే స్టేషన్లు, కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

ఆంధ్రప్రదేశ్ లో కూడా విశాఖపట్నం , విజయవాడ, తిరుపతి పట్టణాలలో రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

మరో వైపు నిరుద్యోగుల నిరసనలు, విపక్షాల ఆందోళనలు సాగుతున్నప్పటికీ, అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని ఎందరు డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం ఆ పథకాన్ని అమలు చేసి తీరాలన్న పట్టుదలతో ఉంది.

First Published:  20 Jun 2022 2:31 AM IST
Next Story