Telugu Global
National

అగ్నిపథ్ : తగ్గేదే లేదంటున్న కేంద్రం…అగ్నివీర్ నోటిఫికేషన్ రిలీజ్

అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు, హింస, ఇవ్వాళ్ళ భారత్ బంద్, విపక్షాల వ్యతిరేకత‌…ఇన్ని జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ పథకాన్ని అమలు చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. అగ్నివీర్ రిక్రూట్ మెంట్ కోసం ఇండియన్ ఆర్మీ ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని చోట్ల ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ ల్లో, ఆన్ లైన్ లో జూలై నుండి రిజిస్ట్రేషన్లు మొదలవుతాయని నోటిఫికేషన్ వెల్లడించింది. 8వ తరగతి పాసయినవారు ఆర్మీ అగ్నివీర్ ఉద్యోగం కోసం ఆర్మీ […]

army
X

అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు, హింస, ఇవ్వాళ్ళ భారత్ బంద్, విపక్షాల వ్యతిరేకత‌…ఇన్ని జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ పథకాన్ని అమలు చేసే దిశగా చర్యలు ప్రారంభించింది.

అగ్నివీర్ రిక్రూట్ మెంట్ కోసం ఇండియన్ ఆర్మీ ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది.

అన్ని చోట్ల ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ ల్లో, ఆన్ లైన్ లో జూలై నుండి రిజిస్ట్రేషన్లు మొదలవుతాయని నోటిఫికేషన్ వెల్లడించింది. 8వ తరగతి పాసయినవారు ఆర్మీ అగ్నివీర్ ఉద్యోగం కోసం ఆర్మీ ర్యాలీలో పాల్గొనవచ్చు. అందులో కొన్ని పోస్టులకు మాత్రం 10వ తరగతి పాస్ కావాల్సి ఉంటుంది.

రేపు ఇండియన్ నేవీ అగ్నివీర్ నోటిఫికేషన్, 24 న ఇండియన్ ఏయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదలవుతాయని రక్షణ‌ శాఖ తెలియజేసింది.

ఈ రోజు ఆర్మీ విడుదల చేసిన నోటిఫికేషన్ లో నియమ, నిబంధనలు, అర్హత, తదితర‌ ఇతర ముఖ్యమైన సమాచారాన్ని పొందుపర్చింది.

నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు శిక్షణా కాలంతో సహా నాలుగు సంవత్సరాల పాటు ఆర్మీ యాక్ట్ 1950 కింద నమోదు చేయబడతారు. అగ్నివీర్లు భూమి మీద‌, సముద్రంలో, వాయుమార్గంలో ఎక్కడికైనా సరే పని చేయడానికి ఆదేశించిన చోటికి వెళ్ళాల్సి ఉంటుంది. అగ్నివీరులు ఎలాంటి పెన్షన్ లేదా గ్రాట్యుటీకి అర్హులు కారు.

ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుండి అగ్నివీరుల‌ సేవ ప్రారంభమవుతుంది. వారికి ఆర్మీలో ప్రత్యేకమైన ర్యాంక్‌ను ఇస్తారు, ఇది ప్రస్తుత ర్యాంక్‌లకు భిన్నంగా ఉంటుంది.

“నాలుగు సంవత్సరాల సర్వీస్ వ్యవధిలో సెలవులు, యూనిఫాం, వేతనం, అలవెన్సులు ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలు, సూచనల మేరకు అందజేయబడుతాయి.” అని ఆర్మీ నోటిఫికేషన్ పేర్కొంది.

Image

First Published:  20 Jun 2022 4:23 AM GMT
Next Story