‘ఇది నిరుద్యోగ అగ్నిపథం’… కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజం
కేంద్రం ప్రకటించిన అగ్నిపథకంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. దేశ యువతకు ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రధాని మోడీ అదేపనిగా తప్పుడు హామీలిస్తున్నారని, వారిని బలవంతంగా ‘అగ్నిపథం’పై నడిచేట్టు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వవవలసి ఉందని, కానీ ‘పకోడాలను ఫ్రై’ చేయడమే యువతకు తెలుస్తోందని ఆయన అన్నారు. తమకు జాబ్స్ వస్తాయన్న తప్పుడు ఆశలను ప్రధాని వారిలో కల్పిస్తున్నారని, ఈ దేశ పరిస్థితికి ఆయనే బాధ్యుడవుతారని రాహుల్ పేర్కొన్నారు. […]
కేంద్రం ప్రకటించిన అగ్నిపథకంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. దేశ యువతకు ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రధాని మోడీ అదేపనిగా తప్పుడు హామీలిస్తున్నారని, వారిని బలవంతంగా ‘అగ్నిపథం’పై నడిచేట్టు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వవవలసి ఉందని, కానీ ‘పకోడాలను ఫ్రై’ చేయడమే యువతకు తెలుస్తోందని ఆయన అన్నారు.
తమకు జాబ్స్ వస్తాయన్న తప్పుడు ఆశలను ప్రధాని వారిలో కల్పిస్తున్నారని, ఈ దేశ పరిస్థితికి ఆయనే బాధ్యుడవుతారని రాహుల్ పేర్కొన్నారు. ఆదివారం తన 52 వ పుట్టినరోజును సెలబ్రేట్ చేయరాదని ఆయన తమ పార్టీ నేతలను, కార్యకర్తలను కోరారు. దేశ యువకులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారని, వారికి మనం అండగా ఉండాలని ఆయన సూచించారు. వీరికి సంఘీభావంగా ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద నేడు సోదరి ప్రియాంక గాంధీతో బాటు కాంగ్రెస్ ఎంపీలు, ఉన్నత స్థాయి నేతలు సత్యాగ్రహం చేసిన నేపథ్యంలో.. రాహుల్.. ఈ మేరకు ట్వీట్ చేశారు.
ఫేక్ నేషనలిస్టులను గుర్తించండి..’ ప్రియాంక గాంధీ
అగ్నిపథ్ కి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యువత ఫేక్ (నకిలీ) నేషనలిస్టులను గుర్తించాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కోరారు. అగ్నిపథ్ వ్యతిరేక నిరసనలకు తమ పార్టీ పూర్తి మద్దతునిస్తుందని, కానీ యువకులు శాంతియుతంగా వీటిని కొనసాగించాలని ఆమె అన్నారు. ‘మీకన్నా దేశభక్తులు ఎవరూ లేరు.. మీ కళ్ళను తెరిచి కుహనా జాతీయవాదులను, బూటకపు దేశభక్తిపరులను గుర్తించాలని కోరుతున్నాను.. మీరు జరిపే పోరాటంలో మొత్తం దేశమంతా..
మా పార్టీ అంతా మీకు అండగా ఉంటుంది’ అని ఆమె ఆవేశంగా వ్యాఖ్యానించారు. ఈ స్కీం దేశ యువతను నాశనం చేస్తుందని, ఆర్మీని అంతం చేస్తుందని, ఈ ప్రభుత్వ ఉద్దేశాలను గమనించి దీన్ని పడగొట్టాలని ఆమె అన్నారు. దేశానికి నిజమైన ప్రభుత్వాన్ని తేవాలని, కానీ ఇదే సమయంలో శాంతియుతంగా నిరసనలు తెలపాలని ప్రియాంక పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పధ్దతిలో.. సత్యం, అహింసాయుత మార్గం ద్వారా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని, నిజమైన దేశభక్తిని ప్రతిబింబించేలా దేశంలో సర్కార్ ఏర్పడాలన్నదే మీ లక్ష్యం కావాలని ఆమె అన్నారు.
ఈ కేంద్ర ప్రభుత్వం పేదలకు, యువతకోసం కాక .. బడా పారిశ్రామికువేత్తల కోసం పని చేస్తోందని ఆమె దుయ్యబట్టారు. మళ్ళీమళ్ళీ చెబుతున్నా.. దేశానికి సత్యమైన ప్రభుత్వం వచ్చేలా చూడండి.. ఈ దేశ ఆస్తులను కాపాడండి.. శాంతియుతంగానే నిరసన తెలిపినా దాన్ని ఆపకండి అని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు.