Telugu Global
International

శ్రీలంకలో లాక్‌డౌన్..! రెండు వారాలు అన్నీ బంద్..!

ఇప్పటి వరకూ మనం కరోనా లాక్ డౌన్ చూశాం. కానీ, ఇది ఎకానమీ లాక్ డౌన్. ప్రజల వద్ద డబ్బుల్లేక, కొనే స్థోమత ఉన్నా వస్తువులు అందుబాటులో లేక, ఒక వేళ ఉన్నా.. ధరలు ఆకాశంలో ఉండటంతో ప్రకటించిన లాక్ డౌన్. ప్రజలు వాహనాలు తీస్తే పెట్రోల్, డీజిల్ ఖర్చయిపోతాయేమోనన్న భయంతో పెట్టిన లాక్ డౌన్. పిల్లలు స్కూల్స్ కి, ఉద్యోగులు ఆఫీస్ లకి వస్తే.. రవాణా ఖర్చులు పెరిగిపోతాయని, కరెంటు ఖర్చులు పెరిగిపోతాయని పెట్టిన లాక్ […]

srilanka-lock-down-2-weeks
X

ఇప్పటి వరకూ మనం కరోనా లాక్ డౌన్ చూశాం. కానీ, ఇది ఎకానమీ లాక్ డౌన్. ప్రజల వద్ద డబ్బుల్లేక, కొనే స్థోమత ఉన్నా వస్తువులు అందుబాటులో లేక, ఒక వేళ ఉన్నా.. ధరలు ఆకాశంలో ఉండటంతో ప్రకటించిన లాక్ డౌన్. ప్రజలు వాహనాలు తీస్తే పెట్రోల్, డీజిల్ ఖర్చయిపోతాయేమోనన్న భయంతో పెట్టిన లాక్ డౌన్. పిల్లలు స్కూల్స్ కి, ఉద్యోగులు ఆఫీస్ లకి వస్తే.. రవాణా ఖర్చులు పెరిగిపోతాయని, కరెంటు ఖర్చులు పెరిగిపోతాయని పెట్టిన లాక్ డౌన్. అవును, ప్రస్తుతం శ్రీలంకలో ఇదే పరిస్థితి ఉంది.

రాజపక్స పోయి, రణిల్ సింఘే వచ్చినా పరిస్థితి ఏమాత్రం మారలేదు సరికదా రోజు రోజుకీ తీసికట్టుగా తయారవుతోంది. గతంలో అల్లర్లు జరిగాయి, ఇప్పుడు ఆ ఓపిక కూడా ప్రజల్లో నశించింది, దిష్టిబొమ్మలు తగలబెడతామన్నా కూడా అక్కడ పెట్రోల్ దొరకడం లేదు, ఇక వాహనాల సంగతి వేరే చెప్పాలా..? అందుకే స్కూటర్లు, కార్లు అన్నీ మూలనపడ్డాయి. ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది. దీంతో ప్రభుత్వ ఆఫీస్ లు, స్కూళ్లకు రెండు వారాలు సెలవులు ఇచ్చేసింది ప్రభుత్వం.

ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి మూడు రోజులు సెలవులు ఇచ్చిన శ్రీలంక ప్రభుత్వం, అది కూడా గిట్టుబాటయ్యేలా లేకపోవడంతో మొత్తం రెండు వారాలు పండగ చేసుకోమంటూ సెలవులు ప్రకటించింది. స్కూల్స్ కూడా మూతబడ్డాయి. ఇక ప్రైవేటు కార్యాలయాలు బిజినెస్ లు లేక అంతకు ముందే మూసేశారు. ఒకటీ అరా సూపర్ మార్కెట్లు మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయి.

శ్రీలంకలో ప్రతీ ఐదుగురిలో నలుగురు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి దొరకట్లేదు, నిత్యావసరాలు అసలే లేవు. పొరుగు దేశాలు దయతో పంపించే సరుకులు, మందులతోనే శ్రీలంక రోజులు నెట్టుకొస్తోంది. ఇప్పటికే ప్రజలు అక్రమ వలసలకు సిద్ధమయ్యారు. అయినా కూడా ఆస్తులు వదిలేసుకోలేక కొంతమంది అక్కడే ఉండిపోయారు. ప్రధానిని మార్చేసినా ఎలాంటి ఫలితం లేదు. ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ నుంచి బెయిల్ అవుట్ ప్యాకేజీ కోసం శ్రీలంక ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇబ్బడిముబ్బడిగా ప్రపంచ దేశాలు సాయం చేసినా.. ఇప్పుడల్లా శ్రీలంక కోలుకునేలా కనిపించడంలేదు.

First Published:  19 Jun 2022 4:30 AM IST
Next Story