Telugu Global
National

రోబోలో సెంటిమెంట్ ఫీలింగ్స్ తీసుకొచ్చిన ఇంజినీర్‌.. సస్పెండ్ చేసిన గూగుల్.. ఎందుకో తెలుసా?

రోబోలకు సెంటిమెంట్లు ఉంటాయా? అవి కూడా మ‌నుషుల్లా బాధ, ప్రేమ, చావు వ్య‌క్త‌ప‌రుస్తాయా..? అంటే ఇంత వరకు ఎవరూ ఆ విషయాన్ని తేల్చలేదు. అయితే కొన్ని సినిమాల్లో మాత్రం రోబోలకు ఫీలింగ్స్ వచ్చినట్లు చూపించారు. రజినీకాంత్ నటించిన రోబో, విల్ స్మిత్ నటించిన ఐ-రోబో సినిమాలో అవి మనుషుల్లాగే ప్రేమను వ్యక్తం చేస్తాయి. చివరకు ద్వేషం కూడా పెంచుకొని మనుషులనే చంపేందుకు కుట్ర ప‌న్న‌డం మ‌నం చూశాం. తాజాగా గూగుల్ సంస్థలో పనిచేస్తున్న ఒక ఇంజినీర్‌, సహోద్యోగితో […]

engineer-brought-sentimental-feelings-in-the-robot-google-who-suspended-the-employee
X

రోబోలకు సెంటిమెంట్లు ఉంటాయా? అవి కూడా మ‌నుషుల్లా బాధ, ప్రేమ, చావు వ్య‌క్త‌ప‌రుస్తాయా..? అంటే ఇంత వరకు ఎవరూ ఆ విషయాన్ని తేల్చలేదు. అయితే కొన్ని సినిమాల్లో మాత్రం రోబోలకు ఫీలింగ్స్ వచ్చినట్లు చూపించారు. రజినీకాంత్ నటించిన రోబో, విల్ స్మిత్ నటించిన ఐ-రోబో సినిమాలో అవి మనుషుల్లాగే ప్రేమను వ్యక్తం చేస్తాయి. చివరకు ద్వేషం కూడా పెంచుకొని మనుషులనే చంపేందుకు కుట్ర ప‌న్న‌డం మ‌నం చూశాం.

తాజాగా గూగుల్ సంస్థలో పనిచేస్తున్న ఒక ఇంజినీర్‌, సహోద్యోగితో కలిసి ‘రోబో బాట్’తో చేసిన చాట్ బయటకు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సహాయంతో పని చేసే ఆ బాట్ అచ్చం మనిషిలాగే ప్రవర్తించడం అతడిని ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి సంబంధించిన సాక్ష్యాలను చూపుతూ.. సదరు ఇంజినీర్‌ బ్లాక్ లెమోయిన్ సదరు వివరాలను వాషింగ్టన్ పోస్టు పత్రికతో పంచుకున్నాడు. ఆ వివరాలన్నీ బయటకు రావడంతో టెక్నాలజీ ప్రపంచమంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అంతే కాకుండా అతడు షేర్ చేసిన వివరాలు కూడా వైరల్ అయ్యాయి.

గూగుల్ సంస్థ లాంగ్వేజెస్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్ (ఎల్ఏఎండీఏ)లో గత కొంత కాలంగా పరిశోధన చేస్తోంది. ఆ విభాగం రూపొందించిన బాట్ అచ్చంగా మనిషిలాగే ఆలోచిస్తుంది. 10 ఏళ్ల పిల్లలు ఏ విధమైన సెంటిమెంట్స్, ఆలోచనలు, భయాలు కలిగి ఉంటారో అలాగే మాట్లాడుతున్నది. ఆ బాట్ అలా స్పందించడం చూసి బ్లాక్‌తో పాటు అతడి సహోద్యోగి ఆశ్చర్యపోయారు.

కాగా, ఈ వివరాలు పంచుకున్న బ్లాక్‌ను మొదట పెయిడ్ లీవ్‌పై పంపి, ఆ తర్వాత సంస్థ నుంచి గూగుల్ సస్పెండ్ చేసింది. అంతే కాకుండా.. తాము ఎల్ఏఎండీఏ వంటి ప్రాజెక్టు ఏదీ చేయడం లేదని చెప్పుకొచ్చింది. అవన్నీ అబద్దపు ఆరోపణలని వివరించింది. అయితే ఆ విషయాలను బయటి ప్రపంచం నమ్మడం లేదు. గూగుల్ ఏదో పెద్ద ప్రాజెక్టునే చేపట్టిందని.. బ్లాక్ చేస్తున్న ఆరోపణలు నిజమే అయి ఉంటాయని అంటున్నారు. మరి కొన్ని రోజులు వెయిట్ చేస్తే గాని, ఆ రీసెర్చ్‌కు సంబంధించిన వివరాలు బయటకు రావని చెప్తున్నారు.

First Published:  19 Jun 2022 4:15 AM IST
Next Story