ఆ నంబర్‌కు పొరపాటున కూడా డయల్ చేయవద్దు.. అదొక పెద్ద ట్రాప్
ఇంటర్నెట్ వాడకం విస్తృతంగా మారిన తర్వాత సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనం నష్టపోవడం ఖాయం. గతంలో ఈమెయిల్స్, వెబ్ లింక్స్ ద్వారా మన కంప్యూటర్లు, ఫోన్లలోకి చొరబడే వాళ్లు. కానీ ఇప్పుడు ప్రత్యేకమైన నెంబర్లతో యూజర్లను మాయ చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి మోసం ఒకటి చక్కర్లు కొడుతున్నది. 401 నంబర్‌కు డయల్ చేస్తే మీ ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందంటూ సైబర్ నేరగాళ్లు మెసేజెస్ పంపుతున్నారు. టెలికాం కార్యాలయాల నుంచి ఫోన్ […]
ఇంటర్నెట్ వాడకం విస్తృతంగా మారిన తర్వాత సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనం నష్టపోవడం ఖాయం. గతంలో ఈమెయిల్స్, వెబ్ లింక్స్ ద్వారా మన కంప్యూటర్లు, ఫోన్లలోకి చొరబడే వాళ్లు. కానీ ఇప్పుడు ప్రత్యేకమైన నెంబర్లతో యూజర్లను మాయ చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి మోసం ఒకటి చక్కర్లు కొడుతున్నది.
401 నంబర్‌కు డయల్ చేస్తే మీ ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందంటూ సైబర్ నేరగాళ్లు మెసేజెస్ పంపుతున్నారు. టెలికాం కార్యాలయాల నుంచి ఫోన్ చేసినట్లు చేసి.. ఆ నంబర్‌కు డయల్ చేయమంటున్నారు. అయితే వారి మాటలు నమ్మి ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే మనం వారి వలలో ఇరుక్కున్నట్లే. 401 నంబర్‌కు ఫోన్ చేయగానే క్షణాల్లో మన వాట్సప్ అకౌంట్ లాగిన్ చేయడానికి పిన్ వస్తుంది. ఆ తర్వాత కొద్ది సేపటికే లాగౌట్ అవుతుంది.
ఏం జరిగిందో తెలుసుకునేలోపే మన కాల్ డేటా మొత్తం సేకరిస్తారు. అంతే కాకుండా మనం అడిగినట్లే ఏవేవో కారణాలు చెప్తూ మన వాట్సప్‌లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ డబ్బులు కావాలంటూ మెసేజెస్ పంపుతారు. కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో ఉన్నారని.. లేదా అర్జెంట్ అవసరమంటూ డబ్బులు అడుగుతారు. పేటీఎం, జీపే, యూపీఐ ద్వారా డబ్బులు కావాలని అభ్యర్థిస్తారు.
ప్రస్తుతం ఇలాంటి నేరాలు పెరిగిపోయాయని.. గతంలో ఫేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అడిగే వాళ్లని.. కానీ ఇప్పుడు మాత్రం మన వాట్సప్ హ్యాక్ చేసి డబ్బులు అడుగుతున్నారని నిపుణులు చెప్తున్నారు. అంతే కాకుండా మన మొబైల్ యాక్సెస్ మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళితే వాళ్లు మనకు మరింతగా నష్టం చేకూరుస్తారని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి ట్రాప్ కాల్స్ వలలో పడొద్దని అంటున్నారు.
ఎవరైనా ఇంటర్నెట్ స్పీడ్ పెంచుతామని కాల్ చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచిస్తున్నారు.